అన్వేషించండి

Universities: తెలంగాణలో మరో 5 ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, గెజిట్ జారీ చేసిన ప్రభుత్వం

Telangana Universities: తెలంగాణలో ప్రైవేటు వర్సిటీల స్థాపన కోసం 13 విద్యాసంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. గతంతో 5 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. తాజాగా మరో 5 యూనివర్సిటీలు ఏర్పాటు కానున్నాయి.

New Private Universities in Telangana: తెలంగాణలో మరో 5 ప్రైవేటు యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి గత ప్రభుత్వం పంపిన బిల్లులకు జులై 6న గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఆగస్టు 1న గెజిట్ జారీ చేశారు. ఆ ప్రకారం శ్రీనిధి(ఘట్‌కేసర్ మండలం), గురునానక్ (ఇబ్రహీంపట్నం), ఎంఎన్ఆర్(సంగారెడ్డి), కావేరి(వర్గల్, సిద్దిపేట), నిక్మార్(శామీర్‌పేట) యూనివర్సిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు (జీఓ) వెలువడిన తర్వాతే యూనివర్సిటీలు అందుబాటులోకి రానున్నాయి.  

10కి చేరనున్న ప్రైవేట్ యూనివర్సిటీల సంఖ్య..
రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటైతే.. మొత్తం ప్రైవేటు యూనివర్సిటీల సంఖ్య 10కి చేరుకుంటుంది. అయితే ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయా, లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. విద్యాశాఖ ఉత్తర్వుల ఆధారంగా నిర్ణయం ఉండనుంది. ఇప్పటికే రెండు విడతల ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగియడం, మూడో విడత ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుండటంతో ఇప్పుడు ప్రవేశాలకు అనుమతి ఇచ్చినా విద్యార్థులు పెద్దగా చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే..
తెలంగాణలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 సెప్టెంబరు 13న తొలిసారిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సభ ఆమోదం తెలిపిన వెంటనే వాటిని.. అప్పటి గవర్నర్ తమిళిసైకు పంపింది. అయితే ఆమె ఆ బిల్లులపై పలు అభ్యంతరాలను లేవనెత్తారు. అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తదితరులు స్వయంగా గవర్నర్‌ను కలిసి ఆయా సందేహాలను నివృత్తి చేశారు. ఆ తర్వాత బిల్లులను గవర్నర్ తిప్పి పంపారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో స్పందించిన గవర్నర్ తమిళిసై తమ వద్ద బిల్లులేవీ పెండింగ్‌లో లేవంటూ 2023 జులైలో ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో మరోసారి అసెంబ్లీలో బిల్లులను యథావిధిగా ఆమోదించి గవర్నర్‌కు పంపింది. అప్పట్నుంచి వాటికి ఆమోదం లభించలేదు.

ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం..
అయితే జులై 6న గవర్నర్ రాధాకృష్ణన్ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో న్యాయశాఖ ఆగస్టు 1న ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. యూనివర్సిటీల ఏర్పాటుకోసం ఆయా యాజమాన్యాలు నిర్దేశించిన స్థలాల్లో భూ సంబంధిత సమస్యలు ఉన్నాయిన, రిజర్వేషన్లు అమలు తదితర అంశాలోన్లూ అభ్యంతరాలున్నాయని రేవంత్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ.. పాత విధానంలోనే అనుమతులు మంజూరు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం.. 
తెలంగాణలో 'యంగ్‌ ఇండియా' స్కిల్‌ యూనివర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సంద్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. నైపుణ్యాలు లేకపోవడం వల్లే విద్యార్థులకు పట్టాలున్నా.. ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని.. అందుకే స్కిల్ వర్సిటీని రూపకల్పన చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ అన్ని రకాల నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశంతోనే 'యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. అప్పట్లో యంగ్ ఇండియా పత్రికను మహాత్మాగాంధీ మొదలుపెట్టారని.. ఆయన స్పూర్తితోనే ఈ యూనివర్సిటీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే స్కిల్ యూనివర్సిటీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
17 కోర్సులతో ప్రారంభం..
ఈ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. తొలి ఏడాది 6 రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు. దీనిద్వారా రెండు వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆ తర్వాత ప్రవేశాల సంఖ్యను క్రమంగా 20 వేలకు పెంచుతారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తున్న ఈ యూనివర్సిటీలో ఇంటర్‌ తర్వాత మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ, ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వరకు జరిగే సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Embed widget