అన్వేషించండి

AP Schools Reopening: ఏపీలో నేటి నుంచి బడులు ప్రారంభం - మొదటి రోజే 'స్టూడెంట్స్‌ కిట్‌' అందజేత

ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం జూన్ 13 నుంచి ప్రారంభంకానుంది.

Andhra Pradesh Schools Reopen: ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు సుదీర్ఘ వేసవి సెలవు తర్వాత జూన్ 13న తెరచుకోనున్నాయి. కొత్త ప్రభుత్వం.. కొత్త విద్యా సంవత్సరంతో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవం ఉండటంతో విద్యాశాఖ పాఠశాలల రీఓపెనింగ్‌ను ఒక రోజు వాయిదా వేసింది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్యాక్యాలెండర్‌ను విద్యాశాఖ ఇప్పటివరకు విడుదల చేయలేదు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. కొత్త ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఫొటోలతో త్వరలోనే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయనుంది. 

పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులందరికీ స్టూడెంట్‌ కిట్స్‌ అందజేసే విధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, స్టూడెంట్‌ కిట్స్‌‌ను విద్యాశాఖ చేరవేసింది. విద్యార్థులకు ఎనిమిది రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 36 లక్షల విద్యా కానుక కిట్లను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. స్థానిక ఎమ్మేల్యేలతో స్టూడెంట్‌ కిట్లు పంపిణీ చేయనున్నారు. 

గత ప్రభుత్వం అందజేస్తున్న 'జగనన్న విద్యాకానుక' పేరున విద్యార్థులకు అందించే విద్యాకానుకను ఈసారి 'స్టూడెంట్స్‌ కిట్‌'లుగా పేరుమార్చారు. విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్నభోజన పథకం కూడా ప్రస్తుత విద్యాసంవత్సరంలో పేరుమార్చారు. గతంలో జగనన్న గోరుముద్ద పేరుతో అమలు చేసే మధ్యాహ్న భోజనం పథకం ప్రస్తుతం 'పీఎం పోషణ గోరుముద్ద' పేరుతో అమలు చేయనున్నారు. మరోవైపు ఏ ఒక్క స్కూలులోను ఉపాధ్యాయుల కొరత లేకుండా తాత్కాలిక సర్దుబాట్లతో సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. 

విద్యాశాఖ అందజేస్తున్న కిట్‌లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతోపాటు, టోఫెల్‌ వర్క్‌బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ఉంటుంది. పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఇక 6 నుంచి 10 తరగతులకు నోట్‌బుక్స్‌ ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్టుగానే ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు. అలాగే, 3 నుంచి 10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే.

పదోతరగతి సోషల్ స్టడీస్ పుస్తకాలను CBSE బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ సబ్జెక్టులుగా NCERT సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్‌ సైన్స్‌ పుస్తకాలను ఆర్ట్‌ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం 'ఫ్యూచర్‌ స్కిల్స్‌' కోర్సు(Future Skills Course)ను అందుబాటులోకి తెచ్చింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget