అన్వేషించండి

TS Polycet 2023: టీఎస్ పాలీసెట్-2023 ప‌రీక్ష ప్రశాంతం, 92.94 శాతం హాజ‌రు నమోదు!

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ పాలీసెట్-2023' ప‌రీక్ష ప్రశాంతంగా ముగిసింది.

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్యవ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీఎస్ పాలీసెట్-2023' ప్రవేశ ప‌రీక్ష ఏప్రిల్ 17న ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ ప‌రీక్షకు 92.94 శాతం మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష కొన‌సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 296 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వహించారు. పాలీసెట్ ప్రవేశ ప‌రీక్షకు 58,520 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 54,700 మంది హాజరయ్యారు. అలాగే 47,222 మంది బాలిక‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 43,573 మంది బాలిక‌లు ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. మొత్తంగా 1,05,742 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 98,273 మంది హాజ‌రైన‌ట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రవేశ ప‌రీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల‌తో పాటు వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌వ‌న, వెట‌ర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు.

పరీక్ష విధానం..
➥ మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం అమలులో లేదు.

➥ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

వేర్వేరు ర్యాంకులు..
➥ పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్‌ చేస్తారు. టెక్నికల్‌ పాలిటెక్నిక్, అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు. 

పాలిటెక్నిక్‌ (టెక్నికల్‌): 
ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–60, ఫిజిక్స్‌–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి.

అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ: 
అగ్రికల్చర్‌ అండ్‌ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్‌–(60/2=30)–30, ఫిజిక్స్‌–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.

అర్హత మార్కులు..
➥ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి) అంటే 36 మార్కులు,

➥ వ్యవసాయ పాలిటెక్నిక్స్, వెటర్నరీ పాలిటెక్నిక్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం 120 మార్కులలో 30 శాతం (గణితం (60/2), బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిసి) అంటే, 36 మార్కులు త‌ప్పనిసరిగా స్కోర్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16.01.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 24.04.2023.

➥ రూ.100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 25.04.2023.

➥ పాలిసెట్ పరీక్ష తేది: 17.05.2023.

➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 10 రోజుల్లో ఫలితాల వెల్లడి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?
Embed widget