అన్వేషించండి

NEET UG 2022 Latest News Today: నీట్‌ యూజీ 2022ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత?

NEET UG 2022 సెప్టెంబర్‌ 4కు వాయిదా పడిందంటూ వార్తలపై ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంతో చెప్పేసింది.

NEET UG 2022ని వాయిదా వేయాలని విద్యార్థుల నుంచి భారీ డిమాండ్‌ వస్తున్న వేళ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ వింగ్ కీలక ప్రకటన చేసింది. NEET UG 2022ని వాయిదా వేయలేదని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని తెలిపింది. NEET UG 2022 పరీక్షను సెప్టెంబరు 4కి వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక సర్క్యులర్ ప్రచారం చేయడంతో PIB నుంచి స్పష్టత వచ్చింది. PIB సర్క్యులర్‌ను 'నకిలీ' అని తేల్చింది. 

"నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG)ని జూలై 17, 2022కి బదులుగా 4 సెప్టెంబర్ 2022కి రీషెడ్యూల్ చేసిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక నోటీసు హల్ చల్ చేస్తోంది" అని PIB ట్వీట్ చేసింది.

#JUSTICEforNEETUG, #DeferNEETUG అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం ద్వారా NEET UG 2022ని వాయిదా వేయాలని సోషల్ మీడియాలో పలువురు వైద్య పరీక్షల అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సమయంలో PIB నుంచి స్పష్టత వచ్చింది. అయితే, NTA NEET UG 2022 వాయిదా వేయడాన్ని ధృవీకరించ లేదు. NTA త్వరలో NEET అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసే అవకాశం ఉంది. నీట్‌ అడ్మిట్ కార్డ్ 2022 ntaneet.nic.inలో అందుబాటులో ఉంటుంది.

గత వారం చాలా మంది వైద్య అభ్యర్థులు విద్యా మంత్రికి లేఖ రాశారు. మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ, పరీక్షకు సిద్ధం కావడానికి తమకు తక్కువ సమయం ఉందని చెప్పారు. ఆ లేఖలో అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయడానికి గల కారణాలను సూచించారు. ప్రవేశ పరీక్షకు సిద్ధం కావడానికి పరీక్షను 6 వారాల పాటు వాయిదా వేయాలని అధికారులను కూడా కోరారు. 

MBBS అభ్యసించి డాక్టర్ కావాలనేది లక్షల మంది విద్యార్థుల కల. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కూడా ఈ పరీక్షపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రిపరేషన్‌కు సరైనా సమయం లేదనందున చాలా మంది ఈ ఏడాదికి నీట్‌ ఆశలు వదులుకుంటున్నట్టు చెబుతున్నారు. దయచేసి వారికి తగిన సమయాన్ని కేటాయించండి, తద్వారా వారు పరీక్షకు బాగా సిద్ధమవుతారని లేఖలో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget