అన్వేషించండి

CSIR UGC NET Results: సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జులై-2024 ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!

CSIR-UGC-NET: సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ జులై-2024 ఫలితాలు సెప్టెంబరు 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల స్కోరుకార్డులను అందుబాటులో ఉంచారు.

CSIR UGC NET July 2024 Results: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్(జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్(ఎల్‌ఎస్‌)/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం నిర్వహించిన జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ (CSIR-UGC-NET) జులై-2024 ఫలితాలు సెప్టెంబరు 12న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా, జులై 25 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా 187 నగరాల్లో మొత్తం 348 కేంద్రాల్లో జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 2,25,335 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,63,529 మంది హాజరయ్యారు. 

➥ జులై 25న నిర్వహించిన ఎర్త్ సైన్సెస్ పరీక్షకు 8,127 మంది దరఖాస్తు చేసుకోగా 5,171 మంది; ఫిజికల్ సైన్సెస్ పరీక్షకు 35,721 మంది దరఖాస్తు చేసుకోగా 25,075 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇక మ్యాథమెటికల్ సైన్సెస్ పరీక్షకు 40,795 మంది దరఖాస్తు చేసుకోగా 29,118 మంది హాజరయ్యారు

➥ జులై 26న నిర్వహించిన లైఫ్ సైన్సెస్ పరీక్షకు 90,683 మంది దరఖాస్తు చేసుకోగా.. 67,850 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

➥ జులై 27న నిర్వహించిన కెమికల్ సైన్సెస్ పరీక్షకు 50,009 మంది దరఖాస్తు చేసుకోగా 36,315 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

CSIR-UGC-NET July 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ ఫలితాల కోసం అభ్యర్థుల మొదట అధికారిక వెబ్‌సైట్‌ https://csirnet.nta.ac.in సందర్శించాలి. 
➥ అక్కడ హోమ్‌‌పేజీలో కనిపించే ‘Joint CSIR-UGC NET JULY-2024: Score Card (Click Here)’ లింక్‌పై క్లిక్‌ చేయాలి. 
➥ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.
➥ అభ్యర్థుల CSIR-UGC NET ఫలితాలు కంప్యూటర్ స్కీన్ మీద కనిపిస్తాయి. 
➥ అనంతరం స్కోర్‌కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని భవి భద్రపర్చుకోవాలి.

CSIR-UGC-NET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

CSIR UGC NET Results: సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ జులై-2024 ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!

సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం ఎన్‌టీఏ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌కు అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.

పరీక్ష విధానం..
➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.

➥ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి. 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

➥ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget