NIMS UG Courses: నిమ్స్‌లో పారామెడికల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
NIMS Admission Notification: హైదరాబాద్‌లోని నిమ్స్ వివిధ బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఎప్‌సెట్ అర్హత తప్పనిసరి.
Nizam’s Institute of Medical Sciences Admissions: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అనుబంధ హెల్త్ సైన్సెస్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్‌లో 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సులో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌తోపాటు ఎప్‌సెట్ పరీక్షలో అర్హత సాధించినవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీలను ఆగస్టు 27లోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
➥ బీఎస్సీ నర్సింగ్ (మహిళలకు మాత్రమే)
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 100.
అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఒక్కో సబ్జెక్టులో కనీసం 45 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ (సైన్స్) ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తుకు అర్హులు. అయితే ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. వివాహిత మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులు. తెలంగాణ ఎప్‌సెట్ పరీక్షలో అర్హత తప్పనిసరి.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 - 35 సంవత్సరాల మద్య ఉండాలి. దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
➥ బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)
కోర్సు వ్యవధి: 4.5 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 50.
అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా ఫిజియోథెరపీ (ఒకేషనల్ - బ్రిడ్జ్ కోర్సు - బయాలజీ, ఫిజిక్స్)తోపాటు తెలంగాణ ఎప్‌సెట్-2024 పరీక్షలో అర్హత తప్పనిసరి.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
➥ బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్)
కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 100.
విభాగాలవారీగా సీట్లు: అనస్తీషియా టెక్నాలజీ-10, డయాలసిస్ థెరపీ టెక్నాలజీ-20, కార్డియోవ్యాస్కూలర్ టెక్నాలజీ-12, ఎమర్జెన్సీ & ట్రామాకేర్ టెక్నాలజీ-08, రేడియోగ్రఫీ & ఇమేజింగ్ టెక్నాలజీ-10, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ-12, న్యూరో టెక్నాలజీ-06, పర్‌ఫ్యూషన్ టెక్నాలజీ-04, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ-04, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ-10, ట్యాన్స్ ఫ్యూషన్ మెడిసిన్-04.
అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతోపాటు తెలంగాణ ఎప్‌సెట్-2024 పరీక్షలో అర్హత తప్పనిసరి.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2,500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు ప్రింట్ కాపీలను సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: తెలంగాణ ఎప్‌సెట్-2024 ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఎంపికైనవారికి కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
బీఎస్సీ నర్సింగ్, బీపీటీ షెడ్యూలు..
సందర్భం | తేదీ |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 09-08-2024 |
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది | 23-08-2024, 5.00 PM |
దరఖాస్తుల హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది | 27-08-2024, 5.00 PM |
ప్రొవిజినల్ మెరిట్ జాబితా వెల్లడి | 09-09-2024. |
తుది మెరిట్ జాబితా వెల్లడి | 12-09-2024 |
మొదటి విడత కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెల్లడి | 12-09-2024. |
అభ్యర్థులకు కౌన్సెలింగ్ లెటర్ల జారీ | 14-09-2024. |
మొదటి విడత కౌన్సెలింగ్ | 21-09-2024. |
ప్రవేశాలు, ఫీజు చెల్లింపు, ఒరిజినల్ సర్టిఫికిట్లు, బాంక్ సమర్పణకు చివరితేది | తర్వాత ప్రకటిస్తారు. |
మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ | తర్వాత ప్రకటిస్తారు. |
తరగతులు ప్రారంభం | 17-10-2024. |
ప్రవేశాల ముగింపు తేదీ | 31-12-2024. |
బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) షెడ్యూలు..
సందర్భం | తేదీ |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 09-08-2024 |
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది | 23-08-2024, 5.00 PM |
దరఖాస్తుల హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది | 27-08-2024, 5.00 PM |
ప్రొవిజినల్ మెరిట్ జాబితా వెల్లడి | 05-10-2024. |
తుది మెరిట్ జాబితా వెల్లడి | 10-10-2024. |
మొదటి విడత కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెల్లడి | 10-10-2024. |
అభ్యర్థులకు కౌన్సెలింగ్ లెటర్ల జారీ | 14-10-2024. |
మొదటి విడత కౌన్సెలింగ్ | 19-10-2024. |
ప్రవేశాలు, ఫీజు చెల్లింపు, ఒరిజినల్ సర్టిఫికిట్లు, బాంక్ సమర్పణకు చివరితేది | తర్వాత ప్రకటిస్తారు. |
మిగిలిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ | తర్వాత ప్రకటిస్తారు. |
తరగతులు ప్రారంభం | 01-11-2024. |
ప్రవేశాల ముగింపు తేదీ | 31-12-2024. |
దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:
The Associate Dean,
Academic-2, 2nd floor, Old OPD Block,
Nizam’s Institute of Medical Sciences,
Hyderabad 500 082.
Bachelor of Physiotherapy Prospectus