అన్వేషించండి

MAT: మ్యాట్ - ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?

MAT: ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2024 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

MAT Exam Notification 2024: ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2024 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2024 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. పేపర్ ఆధారిత, కంప్యూటర్ ఆధారిత విధానాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే మ్యాట్-2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. పేపర్ ఆధారిత పరీక్ష రాసేవారు ఫిబ్రవరి 20లోగా, కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసేవారు మార్చి 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు...

* మేనేజ్‌మెంట్  ఆప్టిట్యూడ్  టెస్ట్ (మ్యాట్ ) ఫిబ్రవరి 2024 సెషన్ 

అర్హత:  ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్  ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:  ఇంటర్నెట్/పేపర్/కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.2100. రెండు విధానాల్లో పరీక్షలు రాసేవారు రూ.3300 చెల్లించాలి.

పరీక్ష విధానం:

  • అఖిల భారత స్థాయిలో జరిగే మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)ను ఏటా లక్షల మంది రాస్తుంటారు. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా దేశంలోని దాదాపు 600కు పైగా కళాశాలల్లో ఎంబీఏ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం), ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు.
  • మ్యాట్‌ పరీక్షను పేపర్ బేస్డ్ టెస్ట్(పీబీటీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)తోపాటు రిమోట్ ప్రొక్టోరెడ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్(ఐబీటీ) విధానంలో నిర్వహిస్తున్నారు. అంటే.. ‘పెన్- పేపర్’ విధానం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)తోపాటు అభ్యర్థులు తమ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మ్యాట్ పరీక్ష రాయవచ్చు.
  • ఐబీటీ విధానంలో టెస్ట్‌కు హాజరవ్వాలంటే.. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. వెబ్‌క్యామ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న కంప్యూటర్ ద్వారా మాత్రమే అభ్యర్థులు ఇంటి నుంచి పరీక్ష రాసేందుకు అవకాశముంది. అభ్యర్థి.. ఇన్విజిలేటర్ కనుసన్నల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఇంటెలిజెన్స్ & క్రిటికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా అనాలసిస్ & సఫీషియన్సీ, ఇండియన్ & గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు (150 నిమిషాలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల కోత విధిస్తారు.

పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

సిలబస్..

లాంగ్వేజ్ కాంప్రహెన్షన్: ఇందులో అభ్యర్థి ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం, గ్రామర్ పరిజ్ఞానం తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పేరా జంబుల్, రీడింగ్ కాంప్రహెన్షన్, అనలిటికల్ ఎబిలిటీ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్: ఇందులో క్రిటికల్ రీజనింగ్‌పై అభ్యర్థుల ప్రతిభను తెలుసుకునే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా ప్యాసేజ్-కన్‌క్లూజన్, స్టేట్‌మెంట్-ఆర్గ్యుమెంట్, అనాలజీ బేస్డ్ ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, కోడింగ్ అండ్ డీ కోడింగ్, ఫ్యామిలీ ట్రీ, ఎఫెక్ట్ అండ్ కాజ్, సీక్వెన్సింగ్ గుర్తించడం వంటి ప్రశ్నలు అడుగుతారు.

మ్యాథమెటికల్ స్కిల్స్: ఈ విభాగంలో పదో తరగతి స్థాయి ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా జామెట్రీ, నంబర్ సిస్టమ్, ఫంక్షన్స్, డేట్ అండ్ టైమ్, ప్రోగ్రెషిన్, ఆల్జీబ్రా, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశముంది.

డేటా అనాలసిస్ అండ్ సఫిషియన్సీ: ఈ విభాగంలో గ్రాఫ్స్(ఏరియా అండ్ లైన్), డేటా విశ్లేషణ(సఫిషియన్సీ), వెన్ రేఖాచిత్రాలు, పై చార్‌‌ట్స, పజిల్స్, టేబుల్స్ వంటి అంశాల్లో అభ్యర్థుల ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురవుతాయి.

ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్: ఈ విభాగం ప్రధానంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక అంశాలు, చరిత్ర, పాలిటిక్స్, సైన్స్, అవార్డులు, కరెంట్ అఫైర్స్, గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్‌పై అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..

MAT: మ్యాట్ - ఫిబ్రవరి 2024 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?

Notification

MAT Prospectus

Test Cities MAT

Online Registration 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget