అన్వేషించండి

KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇదే

KVS: దేశవ్యాప్తంగా ఉన్న కేవీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఒకటో తరగతికి రిజిస్ట్రేషన్లు; రెండు, ఆపై తరగతుల వారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

KVS Admissions 2024: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఒకటో తరగతికి రిజిస్ట్రేషన్లు; రెండు, ఆపై తరగతుల వారు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులు ఏప్రిల్ 15న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి ఫలితాలు విడుదలైన పది రోజుల తర్వాత పదకొండో తరగతి అడ్మిషన్లను చేపడతారు. ఇక 1వ తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి 6 సంవత్సరాలు నిండి ఉండాలి. మిగతా తరగతులకు కూడా నిబంధనల మేరకు వయోపరిమితి వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1254 కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంది.

ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సబ్జెక్టు  నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.

➥ కేవీల్లో ఒకటో తరగతిలో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి తొలి ప్రొవిజినల్ లిస్ట్‌ను ఏప్రిల్ 19న విడుదల చేస్తారు. సీట్లు ఖాళీని బట్టి రెండో ప్రొవిజినల్ జాబితాను ఏప్రిల్ 29న, మూడో ప్రొవిజినల్ జాబితాను మే 8న విడుదల చేయనున్నట్టు కేంద్రీయ విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి ఒకటో తరగతి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 

➥ కేవీల్లో 2వ తరగతి, ఆ పైతరగతుల్లో (11వ తరగతి మినహాయించి) ఖాళీగా ఉండే సీట్ల భర్తీకి ఏప్రిల్ 1 ఉదయం 8గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 4గంటల వరకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. రెండో తరగతికి ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 15న జాబితాను ప్రకటిస్తారు. 

➥ 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్లకు జూన్ 29 తుది గడువుగా నిర్ణయించారు. కేవీ విద్యార్థులు 11వ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు పదో తరగతి ఫలితాలు వెల్లడైన తర్వాత పది రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 రోజుల్లోపు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు. కేవీ విద్యార్థుల ఎంపిక పూర్తయిన తర్వాత నాన్ కేవీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో తప్పుడు సమాచారం ఇస్తే సీటు ఇవ్వబోమని కేవీఎస్ స్పష్టం చేసింది.

ముఖ్యమైన తేదీలు...

➥ షెడ్యూలు వెల్లడి: 28.03.2024.

➥ నోటిఫికేషన్ వెల్లడి: 31.03.2024.

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.04.2024. (ఉ.10.00 గం. నుంచి)

➥ క్లాస్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 15.04.2024. (సా. 7.00 గం. వరకు)

➥ ఎంపిక జాబితా వెల్లడి: 19.04.2024(లిస్ట్-1), 29.04.2024(లిస్ట్-2), 08.05.2024(లిస్ట్-3).

సెకండ్ నోటిఫికేషన్ (ఎక్స్‌టెండెడ్ తేదీ): 

➥  నోటిఫికేషన్-2 (ఎక్స్‌టెండెడ్): 07.05.2024

➥ రిజిస్ట్రేషన్: 08.05.2024- 15.05.2024

➥ ఎంపికజాబితా వెల్లడి: 22.05.2024 - 27.05.2024.

* క్లాస్-2, ఆపై తరగతులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం (క్లాస్-11 మినహాయించి): 01.04.2024 - 10.04.2024. 

➥ ఎంపిక జాబితా వెల్లడి: 15.04.2024.

➥ ప్రవేశాలు: 16.04.2024- 29.04.2024.

➥ ప్రవేశాలు పొందడానికి చివరితేది: 29.06.2024

➥ క్లాస్-11 (కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 10 రోజుల తర్వాత నుంచి.

➥ కేవీ క్లాస్-11 ఎంపిక జాబితా: పదోతరగతి ఫలితాలు వెల్లడైన 20 రోజుల తర్వాత నుంచి.

➥క్లాస్-11 (నాన్-కేవీ విద్యార్థులు) రిజిస్ట్రేషన్, ఎంపిక జాబితా, ప్రవేశాలు: కేవీ విద్యార్థులు ప్రవేశ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఇతర విద్యార్థులకు ప్రవేశాలకు కల్పిస్తారు.

➥ క్లాస్-11లో ప్రవేశాలు పొందడానికి చివరితేది: పదోతరగతి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి 30 రోజుల వరకు.  

బాలవాటిక I/ II/III ప్రవేశాల షెడ్యూలూ విడుదల..
కేవీల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి ప్రవేశాలతోపాటు.. బాలవాటిక I/ II/III  (1వ తరగతి కంటే ముందు)లో ప్రవేశ షెడ్యూలును కూడా కేవీఎస్ విడుదల చేసింది. మార్చి 31న నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ 29తో ప్రవేశ ప్రక్రియ ముగియనుంది.

KVS Admission Schedule 2024-2025- Class One & Above

KVS Admission Schedule 2024-2025- Balvatika

KVS Admission Notice 2024-2025- Class One (01) & Above

KVS Admission Notice 2024-2025- Balvatika

 KVS Admission Guidelines 2024-2025

Online Portal

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget