అన్వేషించండి

KNRUHS: యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం, గడువు ఇదే!

యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి, ఆయుర్వేద, యునాని, నేచురోపతి-యోగా కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.

యూజీ ఆయుష్‌ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను ఫిబ్రవరి 14 వరకు స్ట్రే వేకెన్సీ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 13న కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయిన సంగతి తెలిసిందే.

యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్‌), నేచురోపతి-యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్ధులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.   

Counselling Website

అలాగే కాంపిటేటివ్ కోటా కింద మాపప్ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, చేరని అభ్యర్థుల వివరాలను కూడా హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. మొత్తం 67 మంది విద్యార్థులు కళాశాలలో చేరలేదు.

కళాశాలల్లో చేరని విద్యార్థుల వివరాల కోసం క్లిక్ చేయండి..

                           

Also Read:

విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!
విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో పీజీలో చేరడానికి లేదా ప్రాక్టీసు చేయడానికి.. వారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)'లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ఆ ధ్రువపత్రం లేకుండా ఎఫ్‌ఎంజీఈకి చేసుకునే దరఖాస్తులను తిరస్కరిచనున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది. ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ధ్రువపత్రం పొందాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చి 8న సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తిస్థాయి వివరాలు నమోదు చేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఇతర వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 

Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్‌ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్‌ గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌‌కు అర్హులు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Andhra Pradesh Village and Ward Secretariat Staff: సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
Telangana Latest News: నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
Pakistani Airstrike: పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
Advertisement

వీడియోలు

6 ఏళ్ల వేట సక్సెస్.. పట్టుబడ్డ రోలెక్స్
ఆసీస్‌తో సమరానికి సిద్ధం..  ప్లేయింగ్ 11 పైనే అందరి చూపు
పెర్త్ పిచ్‌పై రోహిత్, కోహ్లీకి కష్టాలు తప్పవా?
Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్
India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Andhra Pradesh Village and Ward Secretariat Staff: సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
Telangana Latest News: నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
Pakistani Airstrike: పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
Mobile Gaming Addiction: మొబైల్ గేమింగ్ వ్యసనం ప్రాణం తీసింది! ఫేమస్‌ వీడియో గేమ్ ఆడుతూనే బాలుడు మృతి
మొబైల్ గేమింగ్ వ్యసనం ప్రాణం తీసింది! ఫేమస్‌ వీడియో గేమ్ ఆడుతూనే బాలుడు మృతి
Google Diwali Offer: దీపావళి సందర్భంగా గూగుల్ ప్రత్యేక ఆఫర్! కేవలం 11 రూపాయలకే 2TB స్టోరేజ్! వార్షిక ప్లాన్‌లపై డిస్కౌంట్!
దీపావళి సందర్భంగా గూగుల్ ప్రత్యేక ఆఫర్! కేవలం 11 రూపాయలకే 2TB స్టోరేజ్! వార్షిక ప్లాన్‌లపై డిస్కౌంట్!
Nagarjuna: కింగ్ నాగార్జునకు జోడీగా స్వీటీ? - హిట్ పెయిర్ మరోసారి రిపీట్... రోల్ ఏంటో తెలుసా?
కింగ్ నాగార్జునకు జోడీగా స్వీటీ? - హిట్ పెయిర్ మరోసారి రిపీట్... రోల్ ఏంటో తెలుసా?
K Ramp Twitter Review - కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ: డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ... కిరణ్ అబ్బవరం సినిమా ఓవర్సీస్ రిపోర్ట్ ఏమిటంటే?
కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ: డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ... కిరణ్ అబ్బవరం సినిమా ఓవర్సీస్ రిపోర్ట్ ఏమిటంటే?
Embed widget