News
News
X

యూజీ ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు నేడు రేపు వెబ్ కౌన్సెలింగ్‌

ఫిబ్రవరి 28న సాయింత్రం 4 గంటల నుంచి మార్చి 1న మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

FOLLOW US: 
Share:

కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ హోమియో కళాశాలల్లో యూజీ బీహెచ్‌ఎంఎస్ వైద్యవిద్య సీట్ల భర్తీకి  మార్చి 1 వరకు అదనపు స్ట్రే వేకెన్సీ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఫిబ్రవరి 28న ప్రకటించింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ మిగిలిపోయిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న సాయింత్రం 4 గంటల నుంచి మార్చి 1న మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 

Counselling Website  (BHMS):

అదే విధంగా యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్‌), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మరో ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 28న సాయింత్రం 4 గంటల నుంచి మార్చి 1న మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ చూడాల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Counselling Website (Ayush):

Also Read:

మ‌హాత్మాజ్యోతిబాపులే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌-2023 నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌లో ప్రవేశాలకు పదోతరగతి, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్ అర్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. మార్చి 1న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి.విజయలక్ష్మీతో కలిసి ఆయన విడుదల చేశారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు లాసెట్, పీజీఎల్ సెట్‌కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 16 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు జారీ చేయనున్నారు. మే 25న పరీక్ష నిర్వహించనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ ఎంసెట్-2023 నోటిఫికేష‌న్ విడుదల, చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
టీఎస్ ఎంసెట్-2023 (తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023) నోటిఫికేష‌న్‌ను జేఎన్‌టీయూ హైదరాబాద్ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 28 Feb 2023 09:02 PM (IST) Tags: Education News in Telugu KNRUHS Admissions Ayush Admissions BHMS Web Options Ayush Web options

సంబంధిత కథనాలు

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

TS TOSS Exam Schedule: తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల - పరీక్షల తేదీలివే!

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

GAT 2023 Application: గాట్-2023 దరఖాస్తుకు మార్చి 26తో ఆఖరు, పరీక్ష ఎప్పుడంటే?

TS SSC Exam Hall Tickets: పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!

TS SSC Exam Hall Tickets: పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!

UGC NET Answer Key: యూజీసీ నెట్-2022 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

UGC NET Answer Key: యూజీసీ నెట్-2022 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TCS Hiring: టీసీఎస్‌‌ 'సిగ్మా హైరింగ్‌-2023' - ఫార్మసీ విద్యార్హతతో ఉద్యోగాలు

TCS Hiring: టీసీఎస్‌‌ 'సిగ్మా హైరింగ్‌-2023' - ఫార్మసీ విద్యార్హతతో ఉద్యోగాలు

టాప్ స్టోరీస్

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!

Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!