News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

FOLLOW US: 
Share:

దేశవ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 9వ తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

వివరాలు...

* జేఎన్‌వీల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు

అర్హత: జేఎన్‌వీల్లో ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

వయోపరిమితి: 01.05.2009 - 31.07.2011 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు, నివాస ధ్రువపత్రాల అవసరమవుతాయి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

ప్రవేశ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు(ఇంగ్లిష్‌, హిందీ, సైన్స్‌, మ్యాథమెటిక్స్‌) ఉంటాయి. పరీక్ష పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2023.

➥ ప్రవేశ పరీక్ష తేదీ: 10-02-2024.

Notification

Online Application

Website

ALSO READ:

నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 'సున్నా' మార్కులకు తగ్గిన కటాఫ్!
నీట్ పీజీ విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీజీ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఏడాది నీట్ పీజీ మూడో రౌండ్  కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను 'సున్నా'కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేటగిరీలకు ఈ 'జీరో' కటాఫ్ వర్తించనుంది. సున్నా మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌కు అర్హత ఉన్నట్లే అని ప్రభుత్వం తెలిపింది. మూడో రౌండ్‌లో మొత్తం 13 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో నీట్‌ పీజీ 2023 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లయింది. ఇందుకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సెప్టెంబరు 20న ఒక ప్రకటన విడుదల చేసింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జేఈఈ మెయిన్‌, నీట్‌ షెడ్యూలు విడుదల - ఇతర పరీక్షల తేదీలు ఇలా
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)'  ప్రకటించింది. ఎన్టీఏ ప్రకటించిన పరీక్షల షెడ్యూలులో నీట్, జేఈఈ, సీయూఈటీ, నెట్ వంటి పరీక్షల తేదీలు ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. 
పరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 21 Sep 2023 01:22 PM (IST) Tags: Education News in Telugu JNV Lateral Entry Test 2024 JNV Class 9th Lateral Entry Admissions JNV Class 9th Lateral Entry Admission NVS 9th Class Admissions 2024 JNV Admission 2023

ఇవి కూడా చూడండి

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 తొలిదశకు 12.30 లక్షల దరఖాస్తులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే?

JEE Main 2024: జేఈఈ మెయిన్-2024 తొలిదశకు 12.30 లక్షల దరఖాస్తులు, తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నంటే?

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

TS SET: టీఎస్‌ సెట్‌ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం