JNV Entrance Test: నవోదయ పరీక్ష దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Jawahar Navodaya Entrance Exam Date: దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) మరోసారి పొడిగించింది.
Jawahar Navodaya Vidyalaya Entrance Exam Last Date : దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయ(JVN)లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును నవోదయ విద్యాలయ సమితి (NVS) మరోసారి పొడిగించింది. నవంబరు 7తో గడువు ముగియగా.. నవంబర్ 15 వరకు పొడిగించినట్లు ఎన్వీఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
వివరాలు..
* జేఎన్‌వీల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
అర్హత: జేఎన్‌వీల్లో ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.05.2009 - 31.07.2011 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు, నివాస ధ్రువపత్రాల అవసరమవుతాయి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ప్రవేశ పరీక్ష: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు(ఇంగ్లిష్, హిందీ, సైన్స్, మ్యాథమెటిక్స్) ఉంటాయి. పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
Notification
Online Application
* జేఎన్‌వీల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
అర్హత: జేఎన్‌వీల్లో ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.06.2007 - 31.07.2009 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు, నివాస ధ్రువపత్రాల అవసరమవుతాయి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ప్రవేశ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం అయిదు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, సైన్స్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్) ఉంటాయి. పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.10.2023. (15.11.2023 వరకు పొడిగించారు)
➥ ప్రవేశ పరీక్షతేది: 10.02.2024.