అన్వేషించండి

APSWREIS: డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.

APSWREIS Inter Admissions: తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు. 

అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ ద్వారా మార్చి 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి దరఖాస్తు అప్‌లోడ్ చేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ వివరాల్లో మార్పులకు అవకాశం ఉండదు. కాబట్టి వివరాలు జాగ్రత్తగా నమోదుచేయాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు. రాష్ట్రంలోని 164 గురుకుల జూనియర్ కాలేజీల్లో మొత్తం 13,230 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎస్సీలకు ఎస్సీలకు 75%, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్ క్రిస్టియన్స్)లకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. వీటిలో ఐఐటీ మెడికల్ అకడమీలో ఎంపీసీ 300 సీట్లు, బైపీసీ 300 సీట్లు ఉన్నాయి.

వివరాలు..

* డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల ప్రవేశాలు (బీఆర్‌ఏజీ ఇంటర్ సెట్-2025)

సీట్ల సంఖ్య: 13,230.

సీట్ల కేటాయింపు: ఎస్సీలకు 75%, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్ క్రిస్టియన్స్)లకు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఇతరులకు 2% సీట్లు కేటాయించారు. 
ఇంటర్ గ్రూప్, సీట్లు: ఎంపీసీ- 5,400, బైపీసీ- 5,400, ఎంఈసీ- 800, సీఈసీ- 1600, హెచ్ఈసీ- 360.

అర్హత: విద్యార్థులు తమ సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.1,00,000 మించకూడదు.

వయోపరిమితి: 31.08.2025 నాటికి 17 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు..

➥ ఎంపికైన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో పాఠశాల ప్రిన్సిపాలు ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాలి.

➥ జూనియర్ ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి 10వ తరగతి పాస్ సర్టిఫికేట్.

➥ కాస్ట్ సర్టిఫికేట్.

➥ ఇన్కమ్ సర్టిఫికేట్.

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్(TC), అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థుల కేటగిరీ యొక్క ఇతర సంబంధిత సర్టిఫికెట్స్. 

➥ అడ్మిషన్ కోసం సంబంధిత సర్టిఫికేట్ జతచేయాలి.

➥ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (CAS) స్థాయి కంటే తక్కువ కాకుండా మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్. 

➥ ప్రత్యేక కేటగిరీ హోదా (రిజర్వేషన్ ప్రమాణాల ప్రకారం) కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేయబడినట్లైతే సంబంధిత సర్టిఫికేట్.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. గణితం- 25, ఫిజికల్ సైన్స్- 15, బయాలజీ- 15, సోషల్ స్టడీస్- 15, ఇంగ్లిష్- 15, లాజికల్ రీజనింగ్- 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.03.2025.

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 01.04.2025.

➥ ప్రవేశ పరీక్ష తేది: 06.04.2025. (పరీక్ష సమయం: 2.00 PM to 4.30 PM)

➥ పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం IIT-మెడికల్ అకాడమీలో ప్రవేశ పరీక్ష తేది: 20.04.2025. 

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget