అన్వేషించండి

GATE Results: గేట్ - 2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

GATE 2024 Results: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే గేట్-2024 స్కోరు కార్డులు మాత్రం మార్చి 23 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.

గేట్ - 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

GATE 2024 పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీని ఐఐఎస్సీ బెంగళూరు మార్చి 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో గేట్ పరీక్షలను ఐఐఎస్సీ బెంగళూరు నిర్వహించగా.. ప్రాథమిక ఆన్సర్ కీని ఐఐఎస్సీ బెంగళూరు ఫిబ్రవరి 19న విడుదల చేసింది. అభ్యర్థుల రెస్సాన్స్ షీట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 మధ్య అభ్యంతరాలు స్వీకరించింది. మార్చి 15న ఫైనల్ ఆన్సర్ కీని, మార్చి 16న ఫలితాలను ప్రకటించింది. 

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

ఈసారి 30 సబ్జెక్టులకు పరీక్ష..
దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.  'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది.

గతేడాది బ్రాంచ్‌లవారీగా కటాఫ్ మార్కులు ఇలా..

➥ కంప్యూటర్ సైన్స్ (సీఎస్): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-27 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-20 మార్కులు. 

➥ సివిల్ ఇంజినీరింగ్ (సీఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-28 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ): జనరల్ ➜ 30-36 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 28-32 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 20-25 మార్కులు.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-30 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
Embed widget