Medical Admissions: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!
తెలంగాణలో 2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం(జులై 12) నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో 2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం(జులై 12) నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడంలో భాగంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పిటిషనర్లను అనుమతించాలంది. మెడికల్, డెంటల్ సీట్ల భర్తీ ప్రక్రియలో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జులై 3న జారీ చేసిన జీవో 72ను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన పి.సాయి సిరిలోచన, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం బుధవారం(జులై 12) విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర విభజన సందర్భంగా మెడికల్ సీట్లలో రెండు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే నిమిత్తం 15 శాతం సీట్లను రిజర్వు చేసినట్లు చెప్పారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏపీ విద్యార్థులు ఇక్కడ ఎలా రిజర్వేషన్ కోరతారంది. చట్టప్రకారం 15 శాతం ఆలిండియా కోటా కింద రిజర్వేషన్, మిగిలిన సీట్లు తెలంగాణకే ఉన్నప్పుడు ప్రభుత్వం మళ్లీ జీవో ఎందుకు తెచ్చిందని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్ కేవలం 2014 నాటికి ఉన్న సీట్లకే పరిమితమని.. పునర్విభజన చట్టం అంతవరకే అనుమతించిందని, వారికి వాటిలో ఇప్పటికీ రిజర్వేషన్ కల్పిస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ తెలిపారు. 2014 తరువాత ఏర్పాటైన కళాశాలల్లోని సీట్లలో ఆలిండియా కోటా 15 శాతం పోను మిగిలినవన్నీ తెలంగాణ విద్యార్థులకే వర్తింపజేస్తూ జీవో తెచ్చినట్లు చెప్పారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామనడంతో అందుకు ధర్మాసనం అనుమతిస్తూ ప్రతివాదులకు నోటీసులకు జారీ చేసింది. అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ALSO READ:
సీజీఎల్‌ఈ-2023 'టైర్-1' అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. రీజియన్లవారీగా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీజీఎల్ 'టైర్-1' పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో జులై 14 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో 7,500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial