అన్వేషించండి

SGT: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అర్హత మార్కులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

TS DSC: సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కేటగిరీలో ప్రాథమిక స్థాయిలో బోధించే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల (ప్రత్యేక అవసరాల పిల్లలు) కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

Special Education Teachers: తెలంగాణలో ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) కేటగిరిలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్(ప్రత్యేక అవసరాల పిల్లలు) పోస్టుల అర్హత మార్కులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్  కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) జారీ చేసిన నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఏప్రిల్ 16న ఆదేశాలు జారీచేసింది. 

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన డీఎస్సీలో స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల కేటగిరీ కింద 796 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీరికి ఇంటర్మీడియట్‌లో కనీస అర్హత మార్కులను ఓసీలకు 50 శాతంగా; ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితరులకు 45 శాతంగా నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్ల డీఈడీ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది.

అభ్యర్థులకు 50 శాతం అర్హత మార్కులు పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోల్‌కు చెందిన విజయాచారితో పాటు మరో 10 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 28న పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన జీవో 4ను కూడా సవాల్‌ చేశారు. ఓసీలకు ఇంటర్‌లో 45 శాతంగా, ఇతరులకు 40 శాతంగా కనీస అర్హత మార్కులను పరిగణించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 16న‌ విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్‌.రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో జీవో ఎంఎస్‌ నంబర్‌ 1 కింద జారీ చేసిన సవరించిన నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. అందులో ఓసీలకు ఇంటర్మీడియట్‌ స్థాయిలో 45 శాతం, ఇతరులకు 40 శాతం కనీస అర్హత మార్కులను తగ్గించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఈ జీవోను పరిగణనలోకి తీసుకోకుండా కనీస అర్హత మార్కులను నిర్దేశించడం చట్టవిరుద్ధమన్నారు. 2007 తరువాత డీఈడీలో చేరిన ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించని అభ్యర్థులకు ఇదే హైకోర్టు అనుకూల ఉత్తర్వులు జారీ చేసిందని, పిటిషనర్లకు కూడా వీటిని వర్తింపజేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం నోటిఫికేషన్ నిబంధనల్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏప్రిల్ 20తో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు..
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET)- 2024 దరఖాస్తు గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఏప్రిల్ 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఒక పేపర్‌కు దరఖాస్తు చేసుకునేవారు రూ.1000, రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.2,000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.  ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 3 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను  ఏప్రిల్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలను జూన్ 12న విడుదలచేయనున్నారు.
టెట్ నోటిఫికేషన్, దరఖాస్తు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget