అన్వేషించండి

CUET UG Result 2022: విద్యార్థులకు అలర్ట్ - సీయూఈటీ యూజీ ఫలితాల వెల్లడి సమయమిదే!! రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!

సీయూఈటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు తెలుసుకోవచ్చు.

CUET UG Result: దేశంలోని వివిధ ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు సెప్టెంబర్15న వెలువడనున్నాయి. రాత్రి 10 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సీయూఈటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు విడుదలయ్యాక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేది వివరాలు నమోదుచేసి తమ ఫలితాలను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 

ఫలితాల కోసం వెబ్‌సైట్: https://cuet.samarth.ac.in/

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-2022) నిర్వహించిన సంగతి తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలు నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 30 వరకు నిర్వహించారు.

ఈ పరీక్ష కోసం దాదాపు 14,90,000  మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి దూరవిద్య, సార్వత్రిక, ఆన్‌లైన్ విధానంలో పూర్తిచేసిన డిగ్రీ/పీజీ కోర్సులను రెగ్యులర్ డిగ్రీ/పీజీ కోర్సులతో సమానంగానే పరిగణిస్తామని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తెలిపింది.

CUET UG Result 2022: విద్యార్థులకు అలర్ట్ - సీయూఈటీ యూజీ ఫలితాల వెల్లడి సమయమిదే!! రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!
మార్కుల కేటాయింపు ఇలా..

♦ అభ్యర్థి రాసిన సరైన సమాధానానికి ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు.

♦ ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్క్ మైనస్ (-1) చేస్తారు.

♦ ఆన్సర్ చేయకుండా వదిలివేసిన ప్రశ్నలకు ఎలాంటి మార్కులు ఇవ్వరు.

♦ ఫైనల్ రిజల్ట్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ సరైనవని తేలితే, సరైన ఆప్షన్స్‌లో దేనినైనా గుర్తించిన వారికి మాత్రమే ఐదు మార్కులు ఇస్తారు.

♦ ప్రశ్నకు ఇచ్చిన అన్ని ఆప్షన్స్ సరైనవని గుర్తిస్తే.. ప్రశ్నను ప్రయత్నించిన వారందరికీ ఐదు మార్కులు (+5) కేటాయిస్తారు.

♦ ఆప్షన్స్‌లో ఏదీ సరైనది కాకపోయినా లేదా ఏదైనా ఒక ప్రశ్న తప్పుగా వచ్చినా లేదా క్వశ్చన్‌ను డ్రాప్ చేసినా.. డ్రాప్ చేసిన ప్రశ్నను ప్రయత్నించిన అభ్యర్థులందరికీ ఐదు మార్కులు (+5) ఇవ్వనున్నారు.

దరఖాస్తుల సవరణకు అవకాశం

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల అప్లికేషన్ కరెక్షన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఓపెన్ చేసింది. సెప్టెంబరు 15 వరకు తెరిచి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా పొరపాట్లు దొర్లినవారు అప్లికేషన్‌లో సవరణలు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

CUET UG అప్లికేషన్‌ను ఎలా కరెక్షన్ చేయాలి?

1. ముందు CUET అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in ఓపెన్ చేయండి.

2. మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

3. ఇప్పుడు CUET అప్లికేషన్ కరెక్షన్ లింక్‌పై క్లిక్ చేయండి.

4. మీ స్క్రీన్‌పై కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది.

5. ఫారమ్‌లో తగిన మార్పులు చేసి, సబ్‌మిట్ చేయండి.

6. ఫారమ్ ఫైనల్ కాపీని, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget