అన్వేషించండి

CPGET 2022: సీపీగెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవే

ఆగస్టు 11 నుంచి 22 వరకు సీపీగెట్‌ పరీక్షలు రాష్ట్రంలోని 12 జోన్లలో పరీక్షల నిర్వహణ

తెలంగాణలోని కళాశాల్లో పీజీ ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) -2022’ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి జులై 29న విడుదల చేసింది. దీనిప్రకారం ఆగస్టు 11 నుంచి 22 వరకు సీపీగెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్) జూన్‌లో నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, మ‌హిళా వ‌ర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. అభ్యర్థుల నుంచి జూన్ 6 నుంచి జులై 4 వరకు, ఆలస్య రుసుముతో జులై 15 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రోజుకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు పొందే వీలుంది. ప్రవేశ పరీక్షలో ర్యాంకును బట్టి ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, కొత్తగా ఏర్పడబో తున్న తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌ టీయూహెచ్‌ పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.

ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లు సీపీజీఈటీ 2021 ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.

పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్ ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్ ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.

డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..
* రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.
* డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్‌ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్‌ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.
* నేషనల్‌ ఇంటిగ్రేషన్‌ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. 
* పీజీ సెట్‌ రాయాలనుకునే వారు తాజాగా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. కుల ధ్రువీకరణ, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. 

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget