అన్వేషించండి

CA Results: సీఏ ఫలితాల్లో తెలుగు సత్తా, ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన సాయి శ్రీకర్!

సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) జులై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

సీఏ ఇంటర్మీడియట్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వై.గోకుల్ సాయి శ్రీకర్ జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. శ్రీకర్ తండ్రి మారుతీకుమార్ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల. బ్యాంకు ఉద్యోగరీత్యా హైదరాబాద్ నిజాంపేటలో స్థిరపడ్డారు. నగరంలోనే ఇంటర్ ఎంఈసీ చదివిన శ్రీకర్ సీఏ కోచింగ్ తీసుకున్నాడు. మూడు స్థాయులను పూర్తి చేస్తేనే సీఏ పట్టా పొందుతారు. అందులో మధ్యస్థాయి అయిన సీఏ ఇంటర్‌లో 800 మార్కులకు 688 సాధించి తొలి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. శ్రీకర్ మొదటి ప్రయత్నంలోనే సీఏ ఇంటర్‌లో గ్రూపు-1, 2 రాసి... మొదటి ర్యాంకు సాధించడం విశేషం. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత సీఏ చివరి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని శ్రీకర్ వెల్లడించారు. 

సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) జులై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను పొందొచ్చు. 

సీఏ ఫైనల్‌ పరీక్షలో అహ్మదాబాద్‌కు చెందిన అక్షయ్‌ రమేశ్‌ జైన్‌ 616/800 మార్కులు సాధించగా.. కల్పేశ్‌ జైన్‌ జి 603/800; ప్రఖార్‌ వర్షిణి 574/800 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ఇకపోతే సీఏ ఇంటర్‌లో  వై. గోకుల్‌ సాయి శ్రీకర్‌; నూర్‌ సింగ్లా, కావ్య సందీప్‌ కొఠారీలు టాపర్లుగా నిలిచి సత్తా చాటారు. 
ఇంటర్మీడియట్‌ కోర్సులో గ్రూపు-1 పరీక్షలు మే 3, 6, 8, 10 తేదీల్లో;  గ్రూపు-2ను 12, 14, 16, 18 తేదీల్లో ICAI నిర్వహించింది. అలాగే, ఫైనల్‌ విద్యార్థులకు గ్రూపు-1ను మే 2, 4, 7, 9 తేదీల్లో, గ్రూపు-2ను మే 11, 13, 15, 17 తేదీల్లో పరీక్ష నిర్వహించిన ఐసీఏఐ తాజాగా ఫలితాలను ప్రకటించింది.

కేవలం 10.24 శాతం మాత్రమే ఉత్తీర్ణత..
సీఏ ఇంటర్ గ్రూపు-1 పరీక్షకు 1,00,781 మంది హాజరుకాగా.. వారిలో 19,103 మంది(18.95%) పాసయ్యారు. గ్రూపు-2లో 81,956 మందికిగాను 19,208 మంది(23.44%) ఉత్తీర్ణత సాధించారు. రెండు గ్రూపులు రాసిన వారు 39,195 మందే ఉండగా.. వారిలో 4,014 మందే పాసయ్యారు. అంటే 10.24 శాతం అభ్యర్థులే చివరి పరీక్షలు రాసేందుకు అర్హత సాధించారు. ఇక  సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాల్లో 25,841 మంది పరీక్షకు హాజరుకాగా.. 2,152 మందే(8.33%) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

ఈ స్కిల్స్ ఉంటే చదువుతూ రెండు చేతులా సంపాదించొచ్చు!
Popular Earning Tips: పాకెట్ మనీ.. చాలా మంది స్టూడెంట్స్ కు అదో భరోసా. చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి పాకెట్ మనీ ఉండాల్సిందే. ఫ్రెండ్స్ తో కలిసి చాయ్ తాగాలన్నా, అలా బైక్ పై షికారుకు వెళ్లాలన్నా, కలిసి బిర్యానీ తిన్నాలన్నా.. బీర్ తాగాలన్నా పాకెట్ మనీ కంపల్సరీ. పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ చాలా మంది యువతకు ఏమాత్రం సరిపోదు. కాలేజీ ఫీజులు, పరీక్ష ఫీజులు, బుక్కులు, పెన్నులు, రికార్డులు, ఎక్విప్‌మెంట్లు, ల్యాప్‌టాప్‌లు అబ్బో.. ఈ లిస్టు చాలా పెద్దదే. వాటన్నింటికి పేరెంట్స్ వద్ద డబ్బులు తీసుకుని, పాకెట్ మనీ కూడా తీసుకుని ఇంకా కావాలని అడగాలంటే చాలా మందికి అదోలా ఉంటుంది. అలాంటి స్టూడెంట్లు చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేస్తూ తమ అవసరాలకు కావాల్సినంత సంపాదించుకునేందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy:
Telangana CM Revanth Reddy: "రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga babu Indirect Counters on Varma | టీడీపీ ఇన్ ఛార్జి వర్మపై నాగబాబు పరోక్ష కౌంటర్లు | ABP DesamPawan Kalyan on Tamil Movies | భారతదేశం ఏమన్నా కేకు ముక్క కోసుకోవటానికి.? | ABP DesamPawan Kalyan on his Ideology | పూటకో పార్టీతో ఉంటావనే వాళ్లకు ఇదే నా ఆన్సర్ | ABP DesamPawan Kalyan on Tamilnadu Language Fight | హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీలో మాట్లాడి మేటర్ చెప్పిన పవన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy:
Telangana CM Revanth Reddy: "రక్తమరుగుతుంది, బట్టలూడదీసికొడతారు"- జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 
Telangana CM Revanth Reddy:
"కేసీఆర్ ఆరోగ్యంతో వందేళ్లు అక్కడ ఉండాలే- మేం ఇక్కడ ఉండాలే" స్టేచర్‌పై మళ్లీ రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Telangana CM Revanth Reddy : కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
కృష్ణాజలాలపై చర్చకు సిద్ధమా- కేసీఆర్‌కు సభలో రేవంత్ సవాల్‌
Kurnool Crime News: కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య- ప్రాణం తీసిన రాజకీయ కక్షలు
Telangana Assembly Sessions : తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
తెలంగాణలో సీఎం ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్‌ఎస్- అసెంబ్లీ నుంచి వాకౌట్‌ 
David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
నితిన్ 'రాబిన్ హుడ్'లో వార్నర్ ఎలా ఉంటారో తెలుసా? - అతను వెండితెరపై మెరిసే సమయం ఆసన్నమైందంటూ లుక్ రిలీజ్
Telangana Latest News: తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్ 
తప్పుగా మాట్లాడలేదు, జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తేయండి- స్పీకర్‌కు బీఆర్‌ఎస్ రిక్వస్ట్ 
Prakash Raj: 'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
'ప్లీజ్.. పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి' - తమిళులపై పవన్ కామెంట్స్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Embed widget