అన్వేషించండి

AP EAPCET: ఇంజినీరింగ్‌ మూడో విడత కౌన్సెలింగ్‌‌కు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించారు. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించకుండా స్పాట్ ప్రవేశాలు నిర్వహించడంపై ఉన్నత విద్యామండలి తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ఎట్టకేలకు కౌన్సెలింగ్ నిర్వహణకు ఏపీ ఉన్నత మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈఏపీసెట్ ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్‌కు నవంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. విద్యార్థులు నవంబరు 6 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇది వరకు కన్వీనర్ కోటా తర్వాత స్పాట్ కేటగిరి సీట్లు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు స్పాట్ తర్వాత కన్వీనర్ కోటా చేపట్టింది. ఇప్పటి వరకు ఏ కేటగిరిలోనూ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో కలిపి 27 వేల వరకు సీట్లు ఉండగా.. వాటిలో ఎక్కువగా మెకానికల్, సివిల్, ఈఈఈ సీట్లే ఉన్నాయి. ఇంజినీరింగ్‌కు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయంబర్స్‌మెంట్ కల్పిస్తారు. కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలితే కళాశాలల యాజమాన్యాలు స్పాట్ కోటా కింద భర్తీ చేసుకుంటాయి. 

ఈ ఏడాది ప్రభుత్వం రెండు విడతలు మాత్రమే నిర్వహించి, మిగిలిన సీట్లను స్పాట్ కింద భర్తీ చేసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. దీంతో యాజమాన్యాలు స్పాట్ కేటగిరిలో భర్తీ చేసుకున్నాయి. ఇప్పుడు విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తుందంటూ ఎక్కడా సీట్లు రాని వారి కోసం మూడో విడత చేపట్టింది. మొదటి విడతలో ప్రవేశాలు పొందినవారికి సెప్టెంబరు మొదటి వారం నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తరగతులు పూర్తయ్యాయి. దాంతో ఇప్పుడు మూడో విడతలో ప్రవేశాలు పొందినవారు అకడమిక్ పరంగా వెనుకబడే పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్‌' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు కౌన్సెలింగ్ నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది.

స్పాట్ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు ఉండదు. అదే మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా చేరితే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టాలని ఆందోళనలు చేశారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు ఒక విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని వారు విమర్శించారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే స్పాట్ నోటిఫికేషన్ ఇచ్చినందున చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకున్నాయి. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget