అన్వేషించండి

APEAPCET: ఇంజినీరింగ్‌ మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి, 1,510 మంది విద్యార్థులకు ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా మొత్తం 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ నాగరాణి నవంబరు 11న ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్‌లో భాగంగా మొత్తం 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్‌ నాగరాణి నవంబరు 11న ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విడతల కౌన్సెలింగ్, స్పాట్ కౌన్సెలింగ్ తర్వాత.. ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్లకు మాత్రమే మూడో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 221 ప్రైవేటు కళాశాలల్లో 27,764 సీట్లు అందుబాటులో ఉండగా.. 1,510 సీట్లు భర్తీ అయ్యాయి. మూడో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా బ్రాంచిలు, కళాశాలల ఎంపికకు మొత్తం 1,735 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,510 మందికి సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబరు 14లోపు సంబంధిత కళాశాలల్లో చేరాలని కన్వీనర్‌ సూచించారు.

కళాశాలలో రిపోర్టింగ్ కోసం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు..

➥ ఏపీఈఏపీసెట్-2023 ర్యాంక్ కార్డ్

➥ ఏపీఈఏపీసెట్-2023 హాల్ టికెట్

➥ ఆధార్ కార్డ్

➥ S.S.C లేదా అందుకు సమానమైన మార్కుల మెమో

➥ ఇంటర్మీడియట్ లేదా అందుకు సమానమైన మెమో-కమ్-పాస్ సర్టిఫికేట్

➥ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C)

➥ 01-01-2020న లేదా ఆ తర్వాత జారీ చేసిన ఇన్ కమ్ సర్టిఫికేట్ (వర్తిస్తే) లేదా తెల్ల రేషన్ కార్డు ఉండాలి.

➥ తహసీల్దార్ జారీ చేసిన EWS ఇన్‌కమ్ సర్టిఫికేట్, 2023-24 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యేది. (వర్తిస్తే)

➥ అధికారులు జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్

➥ అభ్యర్థికి ఇన్‌స్టిట్యూషల్ ఎడ్యుకేషన్ లేనిపక్షంలో అర్హత పరీక్షకు ముందు 7 సంవత్సరాల కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్

➥ స్థానికేతర అభ్యర్థులకు సంబంధించి, అన్‌రిజర్వ్‌డ్ సీట్ల కింద కేటాయింపు కోసం వారిని పరిగణనలోకి తీసుకోవాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా ఎంప్లాయర్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబరు 6న ప్రారంభమైంది.  అభ్యర్థులు నవంబరు 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకున్నారు. అభ్యర్థులు నవంబరు 8న అర్ధరాత్రి 12 గంటల వరకు ఆప్షన్లు మార్చుకున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు అధికారులు నవంబరు 11న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్లను కేటాయించారు. ఇప్పటి వరకు ఏ కేటగిరిలోనూ సీట్లు రాని విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పించారు.

ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో ఈ ఏడాది ఎన్నడూలేని విధంగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఇంజినీరింగ్ ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారనుకున్న అభ్యర్థులకు ఉన్నత విద్యామండలి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను పక్కనపెడుతూ.. నేరుగా 'స్పాట్‌' ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబరు 4న ప్రారంభమైన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరు 18 వరకు కొనసాగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్ మాత్రమే ఉన్నత విద్యామండలి నిర్వహించింది. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Hyderabad Jewelry Fraud Nitin 2026: ముసుగులేసుకొచ్చి చేసేదే దోపిడీ కాదు - నమ్మకంగా ఇచ్చేలా చేసుకోవడం కూడా -13 కేజీల ఈ బంగారం ఫ్రాడ్ కేసు అలాంటిదే!
ముసుగులేసుకొచ్చి చేసేదే దోపిడీ కాదు - నమ్మకంగా ఇచ్చేలా చేసుకోవడం కూడా -13 కేజీల ఈ బంగారం ఫ్రాడ్ కేసు అలాంటిదే!
Embed widget