అన్వేషించండి

AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే

శుక్రవారం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే జులై 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి, అలాగే పరీక్ష ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏపీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల; దరఖాస్తులు జూలై 5 వరకు.
  • హాల్ టికెట్లు జూలై 25 నుండి; పరీక్షలు ఆగస్టు 5-21.
  • ప్రాథమిక కీ ఆగస్టు 24; ఫలితాలు సెప్టెంబర్ 15న వెల్లడి.

AP TET 2026: అమరావతి: ఏపీ టెట్ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్ గుడ్‌న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) రాసే అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా టెట్ పరీక్షల పూర్తి వివరాలను, తేదీలను వెల్లడించారు. టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ ప్రకటనతో వారి నిరీక్షణకు తెరపడింది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 5వ తేదీన (శుక్రవారం నాడు) ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే అంటే, జూన్ 5 నుంచి జులై 5 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించడానికి, అలాగే పరీక్ష ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు. ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం, జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం (Computer Based Test)లో రోజూ రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన కొన్ని రోజులకే ఆగస్టు 24న ప్రాథమిక కీ (ప్రావిజనల్ కీ)ని, సెప్టెంబర్ 8న ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించనున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

AP TET 2026 ముఖ్యమైన తేదీలివే..

  • నోటిఫికేషన్: జూన్ 5న ఏపీ టెట్ అధికారిక నోటిఫికేషన్ విడుదల
  • దరఖాస్తుల స్వీకరణ: జూన్ 5 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, ఫీజులు చెల్లించేందుకు అవకాశం 
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: జులై 25 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • టెట్ ఎగ్జామ్ డేట్స్: ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు.
  • మొదటి సెషన్: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.
  • రెండో సెషన్: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
  • ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల చేస్తారు.
  • ఫైనల్ కీ విడుదల: సెప్టెంబర్ 8న ఫైనల్ కీ (AP TET Final Key) విడుదల 
  • ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Frequently Asked Questions

ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్ ఎవరు ప్రకటించారు?

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ టెట్-2026 పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఏపీ టెట్-2026 దరఖాస్తు ప్రక్రియ ఎప్పటివరకు ఉంటుంది?

ఏపీ టెట్-2026 నోటిఫికేషన్ జూన్ 5న విడుదలైంది. అభ్యర్థులు జూన్ 5 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.

ఏపీ టెట్ పరీక్షలు ఏ తేదీల్లో మరియు ఏ విధానంలో నిర్వహిస్తారు?

ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు.

ఏపీ టెట్ ఫలితాలు మరియు కీ విడుదల తేదీలు ఏమిటి?

ప్రాథమిక కీ ఆగస్టు 24న, ఫైనల్ కీ సెప్టెంబర్ 8న విడుదలవుతాయి. ఏపీ టెట్ ఫలితాలను సెప్టెంబర్ 15న అధికారికంగా వెల్లడిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget