అన్వేషించండి

AP SSC Halltickets: పదోతరగతి హాల్‌‌టిక్కెట్లు వచ్చేస్తున్నాయ్, డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?

ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

AP SSC Exams Halltickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌‌టిక్కెట్లు మార్చి 4న విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్‌ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రకటించిన షెడడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి 30 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

పదోతరగతి హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Step 1 : పదోతరగతి హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి - bse.ap.gov.in

Step 2 : అక్కడ హోంపేజీలో 'AP SSC హాల్‌టికెట్లు'కు సంబంధించిన లింక్‌‌పై క్లిక్ చేయాలి.

Step 3 :  అక్కడ వివరాలు నమోదు చేసి, Submit బటన్‌ మీద క్లిక్ చేాయాలి.

Step 4 : తర్వాతి పేజీలో పదోతరగతి హాల్‌టికెట్‌ను కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

Step 5 : విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.

Website

బస్సులో ఉచిత ప్రయాణం..
ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్ళవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ సూచించింది. 

ఏడు పేపర్లతో పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 

'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు..
ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 

పదోతరగతి పరీక్షల షెడ్యూలు..

➥ మార్చి 18: ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1

➥ మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్

➥ మార్చి 20: ఇంగ్లిష్

➥ మార్చి 22: తేదీ మ్యాథమెటిక్స్

➥ మార్చి 23: ఫిజికల్ సైన్స్

➥ మార్చి 26: బయాలజీ 

➥ మార్చి  27: సోషల్ స్టడీస్ పరీక్షలు

➥ మార్చి 28: మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 

➥ మార్చి 30:  ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష 

టెన్త్  మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..


AP SSC Exam Time Table: ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget