అన్వేషించండి

AP SET 2024: రేపటి నుంచి ఏపీసెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష వివరాలు ఇలా

AP SET 2024: ఏపీలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హత, పదోన్నతులకు వీలుకల్పించే 'ఏపీసెట్-2024' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభంకానుంది.

APTET 2024 Application: ఏపీలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు అర్హత, పదోన్నతులకు వీలుకల్పించే 'ఏపీసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 10న వెలువడిన సంగతి తెలిసిందే. సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏపీసెట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజును చెల్లించి మార్చి 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు రూ.2000 ఆలస్యరుసుముతో మార్చి 16 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో మార్చి 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహణ బాధ్యత చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌‌టికెట్లను ఏప్రిల్ 19 నుంచి అందబాటులో ఉంచనున్నారు.

వివరాలు..

* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (ఏపీసెట్)-2024

సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 

➥ పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు 19.09.1991లోపు మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉంటే దరఖాస్తుకు అర్హులు.

➥ 01.06.2002 కు ముందు సెట్/నెట్ పూర్తిచేసినవారికి ఏపీనెట్2025 నుంచి మినహాయింపు ఉంది.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1(జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2(అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం కేటాయించారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఏపీసెట్ - 2024  నోటిఫికేషన్:  10.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 06.03.2024.

➥ రూ.2000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది: 16.03.2024.

➥ రూ.5000 ఆలస్యరుసుముతో దరఖాస్తుకు చివరితేది (పరీక్ష కేవలం విశాఖపట్నంలో): 30.03.2024. 

➥ హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 19.04.2024 

➥ ఏపీ సెట్ - 224 పరీక్ష తేది: 28.04.2024.

Notification

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget