అన్వేషించండి

OAMDC Registration: ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చివరితేదీ ఎప్పుడంటే?

డిగ్రీ ప్రవేశాలకు 'OAMDC' రిజిస్ట్రేషన్ జూన్ 19న ప్రారంభమైంది. జూన్ 26 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తు ఫీజుగా ఓసీ- రూ.400, బీసీ- రూ.300, ఎస్సీ/ఎస్టీ-రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌(OAMDC)ను ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.

బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు 'OAMDC' రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభమైంది. జూన్ 24 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 

ఇక జూన్ 21 నుండి 23 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన చేపడతారు. తదనంతరం జూన్ 26 నుండి 30 వరకు వెబ్‌ అప్షన్లకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జులై 3న  సీట్లను కేటాయిస్తారు. డిగ్రీ కళాశాలల్లో జులై 4 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.

హెల్ప్‌లైన్‌ కేంద్రాలు ఏర్పాటు..

ప్రవేశాలకు సంబంధించి జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పాసైన విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 19 నుంచి జూన్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 21 నుంచి 23వరకు స్పెషల్‌ కేటగిరీ వెరిఫికేషన్‌ చేపట్టనున్న అధికారులు.. 22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పక్రియ కొనసాగించనున్నారు. జూన్‌ 26 నుంచి 30 వరకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. జులై 3న సీట్ల కేటాయింపు పూర్తి చేసి జులై 4న విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. 

హెల్ప్ లైన్ కేంద్రాల వివరాలు..

OAMDC దరఖాస్తు సమర్పణ కోసం పత్రాల జాబితా..

➥ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ కాపీ

➥ ఇంటర్మీడియట్ బదిలీ సర్టిఫికేట్ (అసలు)

➥ 10వ తరగతి ఉత్తీర్ణత & మెమో సర్టిఫికెట్

➥ ఇంటర్మీడియట్ పాస్ & మెమో సర్టిఫికేట్

➥ కండక్ట్ & స్టడీ సర్టిఫికెట్లు  (గత 3 సంవత్సరాలు)

➥ MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం (SC, ST, BC విషయంలో)

➥ MRO జారీ చేసిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం

➥ నివాస ధృవీకరణ పత్రం

➥ NCC సర్టిఫికేట్లు (వర్తిస్తే)

➥ క్రీడా ధృవపత్రాలు (వర్తిస్తే)

➥ శారీరకంగా సవాలు చేయబడిన సర్టిఫికేట్ (వర్తిస్తే)

➥ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ

➥ యాంటీ ర్యాగింగ్/అండర్ టేకింగ్ ఫారమ్

➥ SC/ST ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం తల్లిదండ్రుల డిక్లరేషన్ ఫారమ్

➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ వెల్లడి: 18.06.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 19.06.2023 - 26.06.2023.

➥ సర్టిఫికేట్ల పరిశీలన: 21.06.2023 - 23.06.2023.

➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 26.06.2023 - 30.06.2023.

➥ సీట్ల కేటాయింపు: 03.07.2023.

➥ తరగతులు ప్రారంభం: 04.07.2023.

డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

'జోసా' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, కౌన్సెలింగ్ పూర్తి వివరాలు ఇలా!
జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) జూన్ 19న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది. 
కౌన్సెలింగ్ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget