AP EAPCET: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కారణమిదే!
. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం, ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు లభించనందున కౌన్సెలింగ్ వాయిదా పడింది.
ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయకపోవడం, ఇంజినీరింగ్ కళాశాలలకు విశ్వవిద్యాలయాల నుంచి అనుబంధ గుర్తింపు లభించనందున కౌన్సెలింగ్ వాయిదా పడింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్లకు గడువు సెప్టెంబరు 5తో ముగిసింది.
అయితే ఇప్పటి వరకు లక్షమందికిపైగా విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు రెండు, మూడు రోజుల్లో సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేయనుంది. ఇంజినీరింగ్ కళాశాలల అనుమతుల ఉత్తర్వులు విడుదలైన తర్వాత ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం కల్పిస్తారు.
ఈఏపీసెట్‌లో ఎన్‌సీసీ, దివ్యాంగులు, సైనికోద్యోగులు, క్రీడల కోటా అభ్యర్థులకు సెప్టెంబరు 8న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రత్యేకంగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ లోని సహాయ కేంద్రంలో ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని సూచించారు.
ఇంజినీరింగ్ కాలేజీలకు ఉన్నత విద్యాశాఖ అనుమతులను పునరుద్ధరించకపోవడంతో ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఉన్నత విద్యాశాఖ అనుమతులు, యూనివర్శిటీల అఫిలియేషన్ కొలిక్కి రాకపోవడంతో కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేయడానికి గడువు ముగిసినా కౌన్సిలింగ్ నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీఈఏపీసెట్ ద్వారా కాలేజీలలో అడ్మిషన్ల కోసం దాదాపు లక్ష మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీలను ఎంచుకునేందుకు రెండు, మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించనున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు మంజూరైన తర్వాత విద్యార్ధులు కాలేజీలను ఎంచుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలేజీలకు అనుమతులు వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుందని చెబుతున్నారు.
ఏపీఈఏపీసెట్‌లో ఎన్‌సీసీ, దివ్యాంగులు, సైనికోద్యోగులు, స్పోర్ట్స్ కోటా అభ్యర్ధులకు సెప్టెంబర్ 8 నుంచి ధృవపత్రాలను పరిశీలించనున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల వినతితో వారికి కూడా వెరిఫికేషన్ అవకాశం కల్పిస్తున్నారు. విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్దుల సహాయ కేంద్రంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తొలివిడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం నెలాఖరు వరకు జరుగనుంది. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి విద్యార్థులకు సీట్లను కేటాయించాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్ధులు ఈఏపీ సెట్‌కు హాజరయ్యారు. వారిలో 1,73,572 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్ధులకు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కాలేజీల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఈ ఆగస్టు 30 వరకు విద్యార్థుల నుంచి ప్రాసెసింగ్ ఫీజును స్వీకరించారు. ఆగస్టు 23 నుంచి 31 వరకు తొలి విడత సర్టిఫికెట్లను పరిశీలన చేశారు. ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. విద్యార్థులకు సెప్టెంబర్ 6న కళాశాలల్ని కేటాయిస్తే సెప్టెంబర్ 12లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని మొదటి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. సెప్టెంబర్ 12 నుంచి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా కౌన్సిలింగ్ వాయిదా నేపథ్యంలో తరగతులు కూడా ఆలస్యం కానున్నాయి.