CM Jagan: నేడు ఏపీ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ, 4.59 లక్షల మందికి లబ్ధి!
ఈ ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు నిరంతరం తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్‌లలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా బైజూస్ కంటెంట్ ద్వారా చదువుకునే వెసులు బాటు ఉంటుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా యడ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉదయం 11 గంటలకు జగన్ ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 21న అధికారికంగా లాంచ్ చేయనున్నారు. డిసెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. వీరితోపాటు 59,176 మంది ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డిసెంబరు 17న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.
ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. వారితోపాటుగా ఉపాధ్యాయులకూ ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. పాఠాలు చెప్పేందుకు వీలుగా ఉంటుందని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ట్యాబ్‌లు అందిస్తారు. ప్రభుత్వం రూ.686 కోట్లతో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందించనున్నారు. రాష్ట్రంలోని 9,703 పాఠశాలల్లోని 4.50 లక్షల మంది విద్యార్థులు, 50,194 మంది ఉపాధ్యాయులు బైజూస్ నుండి కంటెంట్‌తో లోడ్ చేసిన Samsung T220 Lite Tablet PCని పొందనున్నారు.
ఈ ట్యాబ్‌ల వల్ల విద్యార్థులు నిరంతరం తమ సందేహాలను తీర్చుకునే అవకాశం ఉంటుంది. క్లాస్ రూమ్‌లలోనే కాకుండా ఇంటి దగ్గర కూడా బైజూస్ కంటెంట్ ద్వారా చదువుకునే వెసులు బాటు ఉంటుంది. ముఖ్యంగా పేద విద్యార్థులు ఇతరులతో పోటీ పడేందుకు ఈ ట్యాబ్‌లు ఎంతగానే ఉపయోగపడనున్నాయి.
బైజూస్ కంటెంట్‌తో..
➥ ఈ ట్యాబ్‌లలో బైజూస్ ప్రీమియమ్ యాప్ ప్రీలోడెడ్‌గా ఉంటుంది. ఇందులో 8, 9వ తరగతులకు సంబంధించిన ఈకంటెంట్‌ను పొందుపరిచారు.
➥ టెక్ట్స్‌బుక్‌లోని చాప్టర్ వారీగా ఈ కంటెంట్‌ను అందుబాటులో ఉంచారు. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోలజీ, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు ఉండనున్నాయి.
➥ సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి చాప్టర్‌ను కాన్సెప్ట్‌లుగా.. అలాగే కాన్సెప్ట్‌లను స్వల్ప వ్యవధి వీడియోలుగా విభజించారు. మొత్తంగా అన్ని కలిపి 57 చాప్టర్లు, 472 కాన్సెప్ట్‌లు, 300 వీడియోల వరకు ట్యాబ్‌లలో పొందుపరిచారు. అదేవిధంగా వేర్వేరు సబ్జెక్టులకు సంబంధించిన 168 క్వశ్చన్ బ్యాంకులను కూడా ట్యాబ్‌లో ఉంచారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు!
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను నేరుగా వారి ఇళ్లకే పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. దరఖాస్తు చేయకపోయినా పది, ఇంటర్ చదివే విద్యార్థులకు సర్కారే ఈ సర్టిఫికెట్లను అందించనుంది. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు స్కాలర్ షిప్, మోడల్ స్కూల్లు, వేరే ఇతర పాఠశాల్లో చేరాలన్న చాలా అవసరం. అయితే మాడేళ్ల క్రితం వరకు వీటిని దరఖాస్తు చేసుకోవాలంటే నానా తిప్పలు పడేవారు. పట్టాణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్క ధ్రువీకరణ పత్రానికి 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..