అన్వేషించండి

APTET Results: ఏపీ టెట్‌ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, నేడే ఫలితాల వెల్లడి, ఇలా చూసుకోండి

TET Results: ఏపీలో టెట్ 2024 (జులై) ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. మంతి లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.

APTET 2024 July Results: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET July -2024) ఫలితాలు నేడు (నవంబరు 4న) వెల్లడికానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలో ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహించగా.. అర్హత మార్కులను ఓసీ(జనరల్‌) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు. ఈ అర్హత మార్కుల ఆధారంగా టెట్ ఫలితాలను అధికారులు రూపొందించారు. రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 21 వరకు 17 రోజల పాటు టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

ఏపీటెట్ జులై 2024 పరీక్షకు సంబంధించి మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 (86.28 %) మంది పరీక్ష రాశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో జాప్యం జరగడంతో ఫలితాల ప్రకటన నవంబరు 4కి వాయిదా పడింది. ఇప్పటికే రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ వెల్లడైన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో 20% వెయిటేజీ కూడా ఉంది. టెట్‌ స్కోర్‌కు జీవిత కాల గుర్తింపు వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

ఫలితాలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబర్లు: 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9505619127, 9963069286, 9398822618లలో లేదా ఈమెయిల్: grievances.tet@apschooledu.in ద్వారా సంప్రదించవచ్చు.  

ఏపీటెట్ ఫలితాల లింక్..

ఏపీ విద్యాశాఖ అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ  పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 3,68,661 మంది (86.28 శాతం అభ్యర్థులు) పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 17 రోజులపాటు టెట్ ఎగ్జామ్స్ రెండు విడుతలుగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం రెస్పాన్స్‌ షీట్లు, ఫైనల్‌ కీ ఇదివరకే వెల్లడించింది. టెట్‌ స్కోర్‌కు లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటుంది. టీచర్ల నియామక పరీక్షలో దీనికి 20 శాతం వెయిటేజీ కూడా ఉండటంతో ఏపీ టెట్ జులై 2024 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జనరల్‌ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

రెండు రోజుల్లోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్..?
టెట్ ఫలితాలు నవంబరు 4న విడుదల కానుండగా.. ఒకట్రెండు రోజుల్లోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులు భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ప్రిన్సిపల్- 52 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు(SA)-7,725 పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT)-6,371 పోస్టులు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(TGT)-1,781 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(PGT)-286 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)-132 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget