అన్వేషించండి

BRAOU: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు

Ambedkar Open University: డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఉద్యోగం చేస్తూ దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే వారికి శుభవార్త. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University) డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. 2021 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జూన్ 23వ తేదీన ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు ఫీజును రూ.200గా నిర్ణయించింది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. వీటితోపాటుగా 2021-22 విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు సెకండియర్‌ ట్యూషన్‌ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా ఆగస్టు 12వ తేదీ లోగా ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.
విద్య అర్హతలు
అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (డిగ్రీ) కు 10+2 / ఇంటర్మీడియట్ / ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. బీఏ, బీకాం, బీఎస్సీ - తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ - ఉర్దూ మీడియంలలో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. 


BRAOU: అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు
పరీక్ష తేదీలు ఖరారు
అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో జరిగే పలు ప‌రీక్ష‌ల తేదీల‌ను వర్సిటీ అధికారులు ప్ర‌క‌టించారు. డిగ్రీ (సీబీసీఎస్) 4వ సెమిస్ట‌ర్ పరీక్షలు జూలై 6వ తేదీ నుంచి 8వ తేదీ వ‌ర‌కు, డిగ్రీ 2వ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను జూలై 9 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌నలో తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సు పాత బ్యాచ్‌ల ప‌రీక్ష‌ల‌ను జూలై 16 నుంచి ఆగ‌స్టు 1వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నట్లు పేర్కొన్నారు. బీఎడ్ (స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్) ప్ర‌వేశ ప‌రీక్ష‌ను జూలై 18న‌, ఎంబీఏ ( హాస్పిట‌ల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌) ఫస్టియర్ రెండో సెమిస్టర్ ప‌రీక్ష‌లను జూలై 16 నుంచి 24వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. యూనివ‌ర్సిటీ అధికారిక‌ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని విద్యార్థులకు సూచించారు. వాస్తవానికి ఈ ప‌రీక్ష‌ల‌ను మార్చి 25వ తేదీన మొద‌లు పెట్టి ఏప్రిల్‌లో ముగించాల‌ని అధికారులు అనుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Embed widget