NORCET - 2022 Result: నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు వెల్లడి, ఇక్కడ చూసుకోండి!
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఎయిమ్స్ విడుదల చేసింది.
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్)-2022 పరీక్ష ఫలితాలను ఎయిమ్స్-న్యూఢిల్లీ సెప్టెంబరు 27న విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఎయిమ్స్ విడుదల చేసింది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఫలితాలను అందుబాటులో ఉంచారు.
ఫలితాల్లో మొత్తం 19,854 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 7541 పురుషులు ఉండగా.. 12,255, మంది మహిళలు, దివ్యాంగులు 58 మంది ఉన్నారు. ఇక విభాగాల వారీగా చూస్తే.. జనరల్ అభ్యర్థులు 2960, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1013, ఓబీసీ అభ్యర్థులు 8472, ఎస్సీ అభ్యర్థులు 5464, ఎస్టీ అభ్యర్థులు 1945 మంది ఉన్నారు.
Result of the Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET) - 2022
కటాఫ్ మార్కులు ఇలా..
♦ జనరల్/ఈడబ్ల్యూఎస్- 88.4221828
♦ ఓబీసీ- 79.1559850
♦ ఎస్సీ/ఎస్టీ - 68.5860777
♦ జనరల్-దివ్యాంగులు - 81.2156270
♦ ఓబీసీ-దివ్యాంగులు -70.0234449
♦ ఎస్సీ-దివ్యాంగులు - 58.8641294
♦ ఎస్టీ-దివ్యాంగులు - 62.0017967
నర్సింగ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఎయిమ్స్ ఆగస్టు 8న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 11న రెండు సెషన్లలో ఆన్‌లైన్ సీబీటీ పరీక్ష నిర్వహించింది. పరీక్షలో అభ్యర్థుల పర్సంటైల్ (నార్మలైజేషన్) ఆధారంగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ఎయిమ్స్ ప్రకటించింది.
NORCET 2022 ర్యాంకు ఆధారంగా దేశంలోని అన్ని ఎయిమ్స్‌లతోపాటు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.9300- రూ.34800 ( లెవల్ 07 పే మ్యాట్రిక్స్) తోపాటు రూ.4600 గ్రేడ్ పే అందజేస్తారు.
రెండో విడత సీట్లు కేటాయింపు ఫలితాలు కూడా...
NORCET-2021 రెండో విడత సీట్లు కేటాయింపు ఫలితాలను కూడా ఎయిమ్స్ న్యూఢిల్లీ విడుదల చేసింది. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సీట్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు.
Result of 2nd Round of Seat Allocation for NORCET-2021
Also Read:
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా, కొత్త తేదీలివే!
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మరోసారి వాయిదా పడింది. సెప్టెంబరు 28 నుంచి జరగాల్సిన ఈ కౌన్సెలింగ్ వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ అక్టోబరు 11 నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. అక్టోబర్ 11,12న రెండో విడత స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. అలాగే అక్టోబర్ 12న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని అధికారులు చెప్పారు. అక్టోబరు 12,13 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు, ఆ తర్వాత అక్టోబరు 16న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతాయి.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
బీఎస్సీ-నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి, పూర్తి వివరాలు ఇలా!
బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ప్రవేశ ప్రకటన, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..