అన్వేషించండి

AICTE: ఇక మూడేళ్లకోసారి ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతులు, ఏఐసీటీఈ హ్యాండ్‌బుక్ విడుదల

AICTE Approval Process: ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మూడేళ్లకోసారి కాలేజీలకు అనుమతులివ్వాలని నిర్ణయించింది.

AICTE Approval Process: ఇంజినీరింగ్‌ కాలేజీలకు అనుమతుల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మూడేళ్లకోసారి కాలేజీలకు అనుమతులివ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వార్షిక ప్రాతిపదికన కాలేజీలకు అనుమతులు మంజూరుచేయగా.. ఈ విధానాన్ని ఏఐసీటీఈ వెనక్కుతీసుకుంది. 2024 -27 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌ కాలేజీల అప్రూవల్‌ హ్యాండ్‌బుక్‌ (AICTE Approval Handbook)ను ఏఐసీటీఈ శుక్రవారం (నవంబరు 17న) విడుదల చేసింది.

2024 విద్యాసంవత్సరం నుంచి ప్రతి మూడేళ్లకోసారి ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులివ్వనున్నట్లు తెలిపింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) కోర్సులు అందించే కాలేజీలు ఏఐసీటీఈ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని అధికారులు సూచించారు. ఇక యూజీ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ ప్రోగ్రాముల్లో ఫ్యాకల్టీ, స్టూడెంట్‌ రేషియోను 1: 15 నుంచి 1 : 20కి పెంచినట్టు వారు వివరించారు.

Approval Process Handbook (Draft)

ఏఐసీటీఈ పరిధిలోకి బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులు..
దేశంలోని విద్యాసంస్థల్లో ఇకపై బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(BCA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(BBM) కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు ఏఐసీటీఈ తన ముసాయిదా నివేదికలో స్పష్టం చేసింది. దీనిపై నవంబరు 17లోపు అభిప్రాయాలు పంపాలని కోరింది. ఇందుకు సంబంధించిన తుది నిబంధనలపై వచ్చే ఏడాది మార్చిలో హ్యాండ్‌బుక్‌ను విడుదల చేయనున్నారు. 

ఇప్పటివరకు బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు యూజీసీ (UGC) నిబంధనలకు అనుగుణంగా.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతులిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయా విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) జారీ చేస్తాయి. ఇక నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ తరహాలోనే బీసీఏ, బీబీఏ, బీబీఎం కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు పొందాలి. ఏఐసీటీఈ నిబంధనలనే పాటించాలి. 

టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన ప్రమాణాలను అనుగుణంగా ఆయా కోర్సులకు కొత్త సిలబస్‌ను కూడా రూపొందించనున్నారు. త్వరలో దానిపై నిపుణుల కమిటీని నియమించనున్నారు. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం అనుమతులు పొందాల్సి ఉండేది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లపాటు అనుమతి ఇస్తారు. యూజీసీ, ఏఐసీటీఈ తదితర నియంత్రిత సంస్థలను మిళితం చేసి భారత ఉన్నత విద్యా కమిషన్(హెకీ)గా మార్చాలన్న ప్రతిపాదనపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇకపై మూడేళ్లకు అనుమతులు ఇవ్వనున్నారని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు..
కొన్నిచోట్ల ఇప్పటికే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (BTech + MTech) నడుస్తున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇన్ ప్లానింగ్(M.Plan), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA), మాస్టర్ ఇన్ హోటల్‌ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (MH & MCT), మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సులకు అనుమతిస్తారు. దీనివల్ల విద్యార్థులకు ఒక ఏడాది సమయం ఆదా అవడమే కాకుండా విద్యార్థులు యూజీతో చదువు ఆపకుండా పీజీ కూడా చేస్తారన్నది ఏఐసీటీఈ ఉద్దేశంగా ఉంది.

➥ క్యూఎస్/టైమ్ ర్యాంకింగ్‌లో 1000 ర్యాంకులోపున్న విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం ద్వారా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అందించవచ్చు. అంటే కొంతకాలం భారత్‌లో, మరికొంతకాలం విదేశాల్లో చదువుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న కళాశాలకు/వర్సిటీకి న్యాక్‌లో కనీసం 3.01 పాయింట్లు లేదా ఎన్‌బీఏలో వెయ్యికి 650 పాయింట్లు లేదా ఎన్‌ఐఆర్‌ఎఫ్(NIRF) ర్యాంకింగ్‌లో 200 లోపు ఉండటం తప్పనిసరి. 

➥ పాలిటెక్నిక్ సీట్లను ఇంజినీరింగ్‌గా, ఇంజినీరింగ్ సీట్లను పాలిటెక్నిక్ సీట్లుగానూ మార్చుకోవచ్చు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బీటెక్ సీట్లు వస్తాయని అంచనా. 

➥ 40 శాతం క్రెడిట్లను విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా చదివి పొందొచ్చు. వాటినీ పరిగణనలోకి తీసుకుంటారు.

టాప్ హెడ్ లైన్స్

NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget