అన్వేషించండి

ANUEET - 2024: ఏఎన్‌యూ ఇంజినీరింగ్‌ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?

ANUEET-2024: ఏఎన్‌యూ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాలేజీలో సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో డ్యూయల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్‌) కోర్సులో ప్రవేశాలకు ANUEET - 2024 దరఖాస్తు గడువును జూన్ 12 వరకు అధికారులు పొడిగించారు.

ANUEET-2024 Application: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 2024-25 విద్యాసంవత్సరానికి డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్‌యూ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ కాలేజీలో సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో డ్యూయల్ డిగ్రీ (బీటెక్+ఎంటెక్‌) కోర్సులో ప్రవేశాలకు ANUEET - 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. అయితే దరఖాస్తు గడువు మే 29తో ముగియనుండగా.. జూన్ 12 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్‌ అనిత ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు జూన్ 15న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.

వివరాలు..

* బీటెక్+ఎంటెక్‌ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌

మొత్తం సీట్ల సంఖ్య: 510.

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్‌ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ.

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు విభాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట-సి) ఉంటాయి. ఇందులో 'పార్ట్-ఎ'లో మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-40 మార్కులు, 'పార్ట్-బి'లో ఫిజిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, 'పార్ట్-సి'లో కెమిస్ట్రీ-30 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి.  ఇంగ్లిష్ మాధ్యమంలోనే ప్రశ్నలు అడుగుతారు. మ్యాథ్స్‌ (40 ప్రశ్నలు), ఫిజిక్స్‌ (30 ప్రశ్నలు), కెమిస్ట్రీ (30 ప్రశ్నలు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

పరీక్ష కేంద్రాలు: విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06.02.2024.

➥  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.06.2024.

➥ ప్రవేశ పరీక్షతేది: 15.06.2024.

Online Registration

Website

ALSO READ:

మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.45 గంటల వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ) పరీక్షలను మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. 
పరీక్షల హాల్‌టికెట్లు, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget