అన్వేషించండి

8th Pay Commission: బేసిక్ శాలరీ 19,900 ఉన్న పోస్టల్ సిబ్బంది అదృష్టవంతులే! 8వ వేతన సంఘం ప్రకారం పెరిగే జీతం ఎంతో తెలుసా?

8th Pay Commission: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే క్లర్క్ జీతం ఎంత ఉంటుందో మీకు తెలుసా? 8వ వేతన సంఘం ప్రకారం వారికి ఎంత ప్రయోజనం కలుగుతుంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు యువత ఆదరణ పెరుగుతోంది.
  • క్లర్క్ ఉద్యోగానికి 12వ తరగతి, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
  • 7వ వేతన కమిషన్ ప్రకారం క్లర్క్ నెలసరి జీతం ₹37,120-₹39,370.
  • 8వ వేతన సంఘం ఫిట్మెంట్ కారకం 2.86 వరకు పెరగవచ్చు.

8th Pay Commission: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్నాయి. స్థిరత్వం, మంచి జీతాలు, సకాలంలో చెల్లింపులు, భవిష్యత్తు భద్రత కారణంగా చాలా మంది ఈ ఉద్యోగాలు సాధించేందుకు చదువుతుంటారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల్లో పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఆధునికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పని తీరు మార్చుకొని ప్రజలకు సేవలు చేస్తున్నాయి. అందుకే నేటీకీ వాటి అవసరం ప్రజలకు ఉంటోంది. తత్ఫలితంగా, ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యువకులు పోస్టల్ డిపార్టమెంట్‌లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అలాంటి ఉద్యోగులకు 8వ వేతన సంఘం రిపోర్టు తర్వాత ఏ స్థాయిలో జీతాలు పెరుగుతాయో అన్న చర్చ మొదలైంది.  

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో క్లార్క్ ఉద్యోగానికి సాధారణంగా కనీసం 12వ తరగతి లేదా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్లు అర్హులు. అనేక పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. కంప్యూటర్లు, టైపింగ్ పరిజ్ఞానంతోపాటు మంచి విద్య ఉన్న అభ్యర్థులు ఎంపికలో ప్రయోజనాన్ని పొందుతారు. 

ప్రస్తుత జీతం ఎంత?

నివేదికల ప్రకారం, పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లోని క్లర్క్‌ పే మ్యాట్రిక్స్  లెవల్ 2 కిందకు వస్తాయి, గ్రేడ్ పే ₹1,900. 7వ వేతన కమిషన్ ప్రకారం, క్లర్క్ బేసిక్ శాలరీ ₹19,900గా నిర్ణయించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు బేసిక్ శాలరీతోపాటు చాలా అంశాలు జీతంలో కలుస్తుంటాయి. వాటిలో అనేక భత్యాలు ఉంటాయి.

ఈ భత్యాలలో డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం (TA), ఇతర డిపార్ట్‌మెంటల్ అలవెన్సులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే, ఒక క్లర్క్ మొత్తం చేతికి వచ్చేది ₹37,120 నుంచి ₹39,370 మధ్య ఉంటుంది. అందుకే ఈ ఉద్యోగం యువతలో ప్రజాదరణ పొందింది.

ఫిట్‌మెంట్ కారకం అంటే ఏంటి?

కొత్త పే కమిషన్ ప్రకటించినప్పుడల్లా, ఫిట్‌మెంట్ కారకం ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ఫిట్‌మెంట్ ఆధారంగా కొత్త జీతాలు నిర్ణయిస్తారు. దీనిని నిర్ణయించేటప్పుడు, ప్రభుత్వం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ కెపాసిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. 7వ వేతన కమిషన్‌లో, ఫిట్‌మెంట్ కారకం 2.57 రెట్లు ఉండేది, ఉద్యోగుల కొత్త జీతాలు దీని ఆధారంగా నిర్ణయించారు. ఇప్పుడు 8వ వేతన కమిషన్‌లో ఈ కారకం 2.86 వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.

Frequently Asked Questions

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్ ఉద్యోగానికి అర్హత ఏమిటి?

క్లర్క్ ఉద్యోగానికి సాధారణంగా 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.

7వ వేతన కమిషన్ ప్రకారం పోస్టల్ డిపార్ట్‌మెంట్‌ క్లర్క్‌ల జీతం ఎంత?

7వ వేతన కమిషన్ ప్రకారం, క్లర్క్‌ల బేసిక్ శాలరీ ₹19,900. భత్యాలు అన్నీ కలిపితే చేతికి ₹37,120 నుంచి ₹39,370 వరకు వస్తుంది.

8వ వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ కారకం ఎంత పెరగవచ్చు?

8వ వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ కారకం 2.86 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఉద్యోగుల కొత్త జీతాలను నిర్ణయించడంలో సహాయపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
CBSE 10th Rules: సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఉత్తీర్ణత రూల్స్‌లో మార్పుల్లేవ్!
Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget