By: Ram Manohar | Updated at : 05 May 2023 02:15 PM (IST)
మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో రెండు వర్గాల మధ్య కాల్పులు జరగ్గా ఆరుగురు మృతి చెందారు. (Image Credits: Twitter)
Morena Firing:
మొరెనాలో కాల్పులు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి తగాదాలో జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారి తీసింది. మొరెనా గ్రామంలో జరిగిందీ ఘటన. స్థలం విషయంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఉన్నట్టుండి ఓ వ్యక్తి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగుర ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రంజిత్ తోమర్, రాధే తోమర్ మధ్య కొన్నేళ్లుగా స్థలం విషయంలో వాగ్వాదం జరుగుతోంది. 2014లో రంజిత్ తోమర్ కుటుంబం రాధే తోమర్ ఫ్యామిలీలోని ముగ్గురుని హత్య చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు నిందితులు. ఇటీవల మళ్లీ గ్రామానికి వచ్చారు. పగ తీర్చుకునేందుకు రాధే తోమర్ కుటుంబం వేచి చూస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి గొడవ జరిగింది. వెంటనే తుపాకీ తీసి గురి పెట్టారు. కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. దగ్గర్లోనే ఎక్కడో ఓ చోట తలదాచుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామం అంతా జల్లెడ పడుతున్నారు.
MP: Six members of family shot dead in Morena district, say police
— Press Trust of India (@PTI_News) May 5, 2023
Madhya Pradesh | Six people killed and two injured after a clash broke out between two groups over an old land dispute, in the Morena district
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 5, 2023
There was a dispute between the family of Dhir Singh and Gajendra Singh. During the firing, Gajendra Singh and his 2 children died. 4… pic.twitter.com/3WnhBoYHoC
పంజాబ్‌లో కాల్పులు..
పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్లో మరోసారి కాల్పులు జరిగాయి. ఏప్రిల్ 13న జరిగిన ఈ ఘటనలో ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఏప్రిల్ 11వ తేదీన సెలవులు ముగించుకుని డ్యూటీలో చేరాడు. సెంట్రీ డ్యూటీ చేస్తుండగా కాల్పులు జరిగాయి. గన్‌షాట్ కారణంగానే జవాన్ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.
"గన్‌షాట్ కారణంగా ఓ జవాన్ మృతి చెందాడు. సర్వీస్ వెపన్తో సెంట్రీ డ్యూటీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ వెపన్తో పాటు క్యాట్రిడ్జ్ కూడా జవాన్ పక్కనే పడి ఉన్నాయి. సమీపంలోని మిలిటరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు జరిగిన ఘటనతో దీనికి ఎలాంటి సంబంధం లేదు"
- ఆర్మీ అధికారులు
ఈ ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు అధికారులు. ఆత్మహత్య చేసుకున్నాడా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.
"ఈ జవాన్ ఏప్రిల్ 11వ తేదీ సెలవులు ముగించుకుని వచ్చాడు. డ్యూటీలో చేరాడు. ఇంతలోగా ఇలా జరిగింది. ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నాం"
- ఆర్మీ అధికారులు
Also Read: Viral News : పోలీసు అంకుల్ మా నాన్నను జైల్లో పెట్టండి- వైరల్‌గా మారిన బాలుడి ఫిర్యాదు
Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్‌లోనే చిన్నారి మృతి
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
Canada Gangster Murder : కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ సింగ్ మర్డర్ - అచ్చం సినిమాల్లోలాగే !
Delhi murder: ఢిల్లీలో నడిరోడ్డుపై అందరూ చూస్తూండగానే బాలిక హత్య - నిందితుడు అరెస్ట్ !
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!