అన్వేషించండి

UPI Plugin: ఫోన్‌పే, గూగుల్‌ పేను భయపెడుతున్న యూపీఐ ప్లగిన్!

UPI Plugin: యూపీఐ లావాదేవీల్లో దాదాపు 80 శాతం వరకు ఫోన్‌పే, గూగుల్‌ పే నుంచే జరుగుతున్నాయి. ఈ రెండు యాప్స్‌కు ఇప్పుడో కొత్త టెక్నాలజీ సవాళ్లు విసురుతోంది. అదే యూపీఐ ప్లగిన్‌.

UPI Plugin: 

ఆన్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది యూపీఐ! జస్ట్‌ స్కాన్‌ చేస్తే చాలు సులభంగా డబ్బులు చెల్లించొచ్చు. ఫోన్‌ నంబర్‌ కొట్టినా డబ్బులు బదిలీ చేయొచ్చు. యూపీఐ లావాదేవీల్లో దాదాపు 80 శాతం వరకు ఫోన్‌పే, గూగుల్‌ పే నుంచే జరుగుతున్నాయి. మార్కెట్‌ లీడర్లుగా అవతరించిన ఈ రెండు యాప్స్‌కు ఇప్పుడో కొత్త టెక్నాలజీ సవాళ్లు విసురుతోంది. అదే యూపీఐ ప్లగిన్‌.

యూపీఐ ప్లగిన్‌ను (UPI Plugin) మర్చంట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కిట్‌ (SDK) అనీ పిలవొచ్చు. ఈ వ్యవస్థ పేమెంట్స్‌ యాప్‌ అవసరం లేకుండానే డబ్బులు జమ చేసుకొనేందుకు వర్చువల్‌ పేమెంట్‌ అడ్రెస్‌ను సృష్టిస్తుంది. దాంతో థర్డ్‌పార్టీ యాప్‌ లేకుండానే కస్టమర్లు వేగంగా, సులభంగా డబ్బులు  చెల్లించొచ్చు. ఉదాహరణకు స్విగ్గీ, జొమాటోనే (Zomato) తీసుకుందాం. వీటిల్లోంచి వినియోగదారులు ఆహార పదార్థాలని ఆర్డర్‌ చేసి డబ్బులు చెల్లించేందుకు యూపీఐ ఎంచుకున్నారని అనుకుందాం. అప్పుడా యాప్‌ నోటిఫికేషన్‌ ద్వారా గూగుల్‌ పే (Google Pay) లేదా ఫోన్‌పేకు (Phoen Pe) తీసుకెళ్లుంది. లావాదేవీ పూర్తవ్వగానే మళ్లీ స్విగీ, జొమాటోకు రీడైరెక్ట్‌ అవుతుంది. ఇలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఎర్రర్స్‌, పేమెంట్‌ ఫెయిల్యూర్స్‌ వంటివి జరుగుతున్నాయి.

యూపీఐ ప్లగిన్‌ ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలని ఎన్‌సీపీఐ (NCPI) భావిస్తోందని సమాచారం. ఈ ప్లగిన్‌ ఉంటే ఇకపై ఇతర యాప్స్‌తో సంబంధం లేకుండా నేరుగా స్విగ్గీ నుంచే డబ్బులు చెల్లించొచ్చు. పేటీఎం, రేజర్‌పే, జస్‌పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్‌ చేసుకొనేందుకు మర్చంట్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్‌ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.

యూపీఐ లావాదేవీల్లో నంబర్‌ వన్‌గా ఉన్న ఫోన్‌పే మాత్రం యూపీఐ ప్లగిన్‌పై భిన్నంగా స్పందించింది. 'సక్సెర్‌ రేటును మెరుగుపర్చేందుకు యూపీఐ ప్లగిన్‌ మోడల్‌ ఎలాంటి టెక్నాలజీ ప్రయోజనాన్ని అందించడం లేదు. ఇది పేమెంట్స్‌ యాప్స్‌ బాధ్యతలను స్పాన్సర్‌ బ్యాంకు, మర్చంట్‌ అప్లికేషన్‌కు మళ్లిస్తోంది. ఈ మోడల్‌ చాలా సంక్లిష్టమైంది. మర్చంట్స్‌కు మరింత భారం అవుతుంది. దాంతో వారు తమ ప్రధాన వ్యాపారంపై దృష్టి సారించలేరు' అని ఆ కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రాహుల్‌ చారీ అంటున్నారు.

కొందరు మర్చంట్లు యూపీఐ ప్లగిన్‌ వైపు మళ్లేందుకు సిద్ధమవుతుండటం ఫోన్‌పే, గూగుల్‌ పేకు ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం ఫోన్‌పేకు 47 శాతం, గూగుల్‌ పేకు 33 శాతం మార్కెట్‌ వాటా ఉంది. వినియోగదారులు వీటి నుంచి కాకుండా నేరుగా మర్చంట్‌ యాప్స్‌ నుంచే డబ్బులు చెల్లిస్తే వీటి మార్కెట్‌ శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. 'స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా, డ్రీమ్‌11 వంటి పెద్ద కంపెనీలు యూపీఐ ప్లగిన్‌ వైపు వస్తే గూగుల్‌ పే, ఫోన్‌పేకు పెద్ద షాకే అవుతుంది. అప్పుడు వారి మార్కెట్‌ వాటా తగ్గుతుంది. అందుకే వారు భయపడుతున్నారు' అని ఎన్‌సీపీఐతో సన్నిహితంగా పనిచేసే సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు మనీ కంట్రోల్‌కు తెలిపారు.

నిజానికి చెల్లింపుల వ్యవస్థలోని మర్చంట్లు, పేమెంట్‌ ప్రాసెసర్లు, బ్యాంకులు సుదీర్ఘ కాలం నుంచి యూపీఐ ప్లగిన్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల్లో 57 శాతం మర్చంట్‌ లావాదేవీలే. అందులో సగం ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతున్నాయి. దీన్నుంచి ఫోన్‌పే, గూగుల్‌ పే ప్రయోజనం పొందుతున్నాయి. మర్చంట్లు యూపీఐ ప్లగిన్‌కు అలవాటు పడితే వీటికి సవాళ్లు ఎదురవ్వక తప్పదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీల్లో (Online Payments) 60 శాతం వరకు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది 75 శాతానికి పెరుగుతుందని అంచనా. అందుకే యూపీఐ ప్లగిన్‌ అత్యంత కీలకం కానుంది.

Also Read: నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా, అది పూర్తయితేనే టాక్స్‌ బెనిఫిట్స్‌ వర్తిస్తాయని తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Adhav Arjuna Divorce: విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
CII Summit First Day MoUs: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు
ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. 35 ఒప్పందాల ద్వారా రూ.1.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 52,956 మందికి ఉపాధి అవకాశాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
Bigg Boss Season 10 Today November 20th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: డైరెక్ట్ 13వ వారంలోకి కెప్టెన్ అమన్ మసూద్! ముకేశ్‌ చేష్టలకు ఫాలోవర్స్ అసహనం!
Embed widget