అన్వేషించండి

Special Trading: శనివారం కూడా స్టాక్‌ మార్కెట్లు పని చేస్తాయి, టైమింగ్స్‌ తెలుసుకోండి

Stock markets to work on saturday: శనివారం నాటి ప్రత్యేక సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్‌ సహా అన్ని సెక్యూరిటీల గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు.

Special Trading Session On 2nd March 2024: స్టాక్‌ మార్కెట్ల విషయంలో శనివారం, ఆదివారాలను 'నాన్‌ ట్రేడింగ్‌ డేస్‌'. అంటే, ఆ వారాల్లో ట్రేడింగ్‌ జరగదు. అయితే, ఈ శనివారం (02 మార్చి 2024) నాడు మాత్రం స్టాక్‌ మార్కెట్లు పని చేస్తాయి. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) ఈ శనివారం రోజున బిజినెస్‌ జరుగుతుంది. ఆ రోజున, డిజాస్టర్ రికవరీ సైట్ (Disaster Recovery Site) వద్ద ఇంట్రాడే నిర్వహిస్తారు. సైబర్ దాడులు & సాంకేతిక సమస్యలు వంటి అనుకోని ఇబ్బందులు తలెత్తినప్పుడు, మొత్తం డేటాను రక్షించేందుకు DR సైట్ పని చేస్తుంది. ఫలితంగా, ఆకస్మిక అవాంతరాల సమయంలోనూ ట్రేడింగ్ సురక్షితంగా మారుతుంది. మార్చి 02న జరిగే ప్రత్యేక సెషన్‌లో... ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ గతంలోనే ఒక సర్క్యులర్‌ను జారీ చేశాయి.

రెండు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లు
పెట్టుబడిదార్లు, ట్రేడర్లందరూ మార్చి 02న డీఆర్‌ సైట్ (DR Site) కోసం ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొనాలని ఆ సర్క్యులర్‌లో స్టాక్‌ మార్కెట్లు సూచించాయి. శనివారం నాడు జరిగే ట్రేడింగ్‌, ప్రైమరీ సైట్ నుంచి DR సైట్‌కు మారుతుంది. DR సైట్‌లో రెండు సెషన్లుగా ట్రేడ్‌ జరుగుతుంది. మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు; రెండో ట్రేడింగ్ సెషన్ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. 

శనివారం నాటి ప్రత్యేక సెషన్‌లో డెరివేటివ్ ప్రొడక్ట్స్‌ సహా అన్ని సెక్యూరిటీల గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ను 5 శాతంగా నిర్ణయించారు. మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ కాంట్రాక్టులకు కూడా ఇది 5 శాతంగా ఉంటుంది. సెబీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

సరిగ్గా మూడేళ్ల క్రితం, 2021 ఫిబ్రవరి 24న, NSEలో టెక్నికల్‌ గ్లిచ్‌ వచ్చింది. ఫలితంగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో ట్రేడింగ్ ఆ రోజు ఉదయం 11.40 నుంచి మధ్యాహ్నం 03.45 గంటల మధ్య నిలిచిపోయింది. అప్పుడు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అత్యవసర సందర్భాల్లో డేటాను రక్షించుకునే వ్యవస్థ ఉండాలని అప్పుడే నిర్ణయించారు. ఈ కారణంగానే విపత్తు పునరుద్ధరణ సైట్‌ను అభివృద్ధి చేశారు.

డిజాస్టర్ రికవరీ సైట్‌ ద్వారా ట్రేడింగ్‌ చేయడం ద్వారా, ఆ సైట్ ఎలా పని చేస్తుందో తనిఖీ చేస్తారు. ఇంకా ఏవైనా అప్‌డేషన్స్‌ అవసరమైతే వాటినీ తీసుకొస్తారు. ఫైనల్‌గా, ఆ సైట్‌ను అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. డిజాస్టర్ రికవరీ సైట్‌ పూర్తిగా సిద్ధమైతే.. సైబర్ దాడులు, సర్వర్ క్రాష్‌లు, ఇతర సమస్యల నుంచి ట్రేడింగ్‌కు రక్షణ కల్పించొచ్చు. ఇది మార్కెట్‌ను, పెట్టుబడిదార్ల సమాచారాన్ని, సంపదను కాపాడుతుంది. 

వాస్తవానికి, ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను ఈ ఏడాది జనవరి 20నే నిర్వహించాల్సి ఉంది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఆ రోజు ఈక్విటీ మార్కెట్‌కు సెలవు కూడా ఇచ్చారు. దీనికి బదులుగా, అదే వారంలోని శనివారం నాడు పూర్తి స్థాయిలో మార్కెట్లను నిర్వహించారు. 

మరో ఆసక్తికర కథనం: మూడు రోజులకొక హాలిడే, స్టాక్‌ మార్కెట్లకు ఈ నెలలో 12 సెలవులు

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget