Stock Market News: మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లలో ఆకలి! నష్టాల్లోంచి భారీ లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market Closing Bell on 9 June 2022: నాలుగు రోజుల వరుస నష్టాలకు నేడు తెరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 121 పాయింట్ల లాభంతో 16,478 వద్ద ముగిసింది.
![Stock Market News: మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లలో ఆకలి! నష్టాల్లోంచి భారీ లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ Stock Market updates Indices snap four day losing streak, Sensex surge 428 points Nifty settles at 16,478 Stock Market News: మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లలో ఆకలి! నష్టాల్లోంచి భారీ లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/09/99072258a074bf25dba6051c155d3cd8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Closing Bell on 9 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) గురువారం లాభాల్లో ముగిశాయి. నాలుగు రోజుల వరుస నష్టాలకు నేడు తెరపడింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ లేదు. డోజోన్స్, నాస్‌డాక్ సూచీలు భారీగా పతనమవ్వడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేకపోవడంతో ఉదయం బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లోనే మొదలయ్యాయి. మధ్యాహ్నం వరకు రేంజ్ బౌండ్‌లో కదలాడిన సూచీలు ఐరోపా మార్కెట్లు తెరుచుకున్నాక సర్రున పైకి ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 121 పాయింట్ల లాభంతో 16,478, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 427 పాయింట్ల లాభంతో 54,716 వద్ద ముగిసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,892 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,514 వద్ద నష్టాల్లో మొదలైంది. 54,507 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,366 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. పది గంటల ప్రాంతంలో 171 పాయింట్ల నష్టంతో సూచీ చివరికి 427 పాయింట్ల లాభంతో 54,716 వద్ద ముగిసింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు.
NSE Nifty
బుధవారం 16,356 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,263 వద్ద ఓపెనైంది. 16,243 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,492 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 121 పాయింట్ల నష్టంతో 16,478 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,802 వద్ద మొదలైంది. 34,659 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,149 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 139 పాయింట్ల లాభంతో 35,085 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 38 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, రిలయన్స్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, శ్రీసెమ్, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ నష్టపోయాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లోనే ముగిశాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువగా ఎగిశాయి. మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)