By: ABP Desam | Updated at : 10 Mar 2022 12:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
stock-market
Indian Stock markets: భారత స్టాక్ మార్కెట్లు గురువారం జోష్‌లో ఉన్నాయి! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు (UP election results) మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటును పెంచాయి. పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ స్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడనుండటం ఇందుకు దోహదం చేసింది. వీటన్నిటినీ మినహాయిస్తే యుద్ధం తాలూకు భయాల నుంచి కాస్త తేరుకున్నట్టు కనిపిస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 1348, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 16,,730, నిఫ్టీ బ్యాంక్ 1498 పాయింట్ల లాభాల్లో ఉన్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 54,647 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 56,242 వద్ద మొదలైంది. భారీ గ్యాప్ అప్‌తో అదరగొట్టింది. 55,564 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ ఆ తర్వాత కొనుగోళ్ల ఊపుతో 56,242 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 1350 పాయింట్ల లాభంతో 55,995 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
బుధవారం 16,345 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,757 వద్ద ఆరంభమైంది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లు చేయడంతో దాదాపుగా 2.5 శాతం వరకు లాభాల్లో కొనసాగుతోంది. 16,593 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 16,757 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 387 పాయింట్ల లాభంతో 16,732 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంకు దూసుకుపోతోంది. 35,153 వద్ద మొదలైన సూచీ 34,716 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరగడంతో 35,374 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం 1510 పాయింట్ల లాభంతో 35,325 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీలో 44 కంపెనీలు లాభాల్లో 6 నష్టాల్లో కదలాడుతున్నాయి. టాటా మోటార్స్ (Tata Motors), యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫిన్‌సర్వ్ 5-6 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. కోల్‌ఇండియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.
BSE commodity price update 9th March, 2022#commodity #exchange #cotton#BRCrude #Gold #Turmeric #Almond #trade #futuretrading #commoditytrading pic.twitter.com/yOt11F1kgC
— BSE India (@BSEIndia) March 10, 2022
Learn Technical Analysis LIVE Online. Program curated by NSE Academy. Gain insights on Technical Patterns, Charts, Major Indicators & Oscillators, and Trading Studies. Course Fee: INR 3250 + GST | Register Now: https://t.co/geDMYLMHVg #technicalanalysis #nseacademy pic.twitter.com/gGWENnJKlw
— NSEIndia (@NSEIndia) March 9, 2022
Taiwanese Shipping Firms: ఉద్యోగులకు షిప్పింగ్ కంపెనీల బంపర్ ఆఫర్లు, మందగమనంలో ఉన్నా మస్తు బోనస్‌లు
FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్ ఉందేమో చూసుకోండి
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్
Mutual Funds: స్మార్ట్‌గా డబ్బు సంపాదించిన స్మాల్ క్యాప్ ఫండ్స్, మూడేళ్లలో 65% రిటర్న్
Online Banking: అన్ని అవసరాలకు ఒకటే బ్యాంక్ అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?