Stock Market Update: 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు హాం ఫట్! నేడూ నష్టాల్లోనే మార్కెట్లు
ఈ వారమంతా సూచీలు పతనమవుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా కీలక సూచీలు భారీ నష్టాల్లోనే ముగిశాయి. కేవలం నాలుగు రోజుల్లో సూచీలు నాలుగు శాతం దిద్దుబాటుకు గురవ్వడంతో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
Stock Market Update Telugu: స్టాక్ మార్కెట్లు మదుపరులను కలవర పెడుతున్నాయి. ఈ వారమంతా సూచీలు పతనమవుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా కీలక సూచీలు భారీ నష్టాల్లోనే ముగిశాయి. కేవలం నాలుగు రోజుల్లో సూచీలు నాలుగు శాతం దిద్దుబాటుకు గురవ్వడంతో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా బాండ్ల రాబడి పెరుగుదల, మార్కెట్ అంచనాలకు తగ్గట్టు కంపెనీల త్రైమాసిక ఫలితాలు లేకపోవడం, ఒమిక్రాన్ భయాలు నష్టాలకు కారణం అవుతున్నాయి.
క్రితం రోజు 59,464 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,039 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 59,329 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి సూచీ ఒడుదొడులకు గురైంది. అటు మద్దతు, ఇటు నిరోధం మధ్యే కదలాడింది. 58,620 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరి అర్ధగంటలో పుంజుకొని 427 పాయింట్ల నష్టంతో 59,037 వద్ద ముగిసింది.
గురువారం 17,757 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17, 613 వద్ద మొదలైంది. 17,707 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి విక్రయాల సెగ తాకడంతో 17,485 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 139 పాయింట్ల నష్టంతో 17,617 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 37,522 వద్ద మొదలైన సూచీ 37,741 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. అక్కడి నుంచి పతనమై 37,224 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త పుంజుకొని 37,574 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 15 కంపెనీలు లాభపడగా 35 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఆటో, హింద్ యునిలివర్, మారుతీ, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, శ్రీ సెమ్, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్ నష్టాల్లో ముగిశాయి. ఒక ఎఫ్‌ఎంసీజీ మినహాయిస్తే అన్ని రంగాల సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!