Stock Market Update: మళ్లీ నష్టాలే! అమ్మకాల ఒత్తిడి.. సెన్సెక్స్ 554, నిఫ్టీ 195 డౌన్
కీలక స్థాయిల వద్ద సెన్సెక్స్, నిఫ్టీకి మద్దతు దొరకలేదు. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.90 శాతం, నిఫ్టీ 1.07 శాతం వరకు పతనమయ్యాయి. మిగతా రంగాల సూచీల్లోనూ అమ్మకాలు కనిపించాయి.
Stock Market updates telugu: మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఒడుదొడుకులకు గురైన కీలక సూచీలు మధ్యాహ్నం తర్వాత పతనమయ్యాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడంతో మార్కెట్లో విక్రయాల ఒత్తిడి కనిపించింది. కీలక స్థాయిల వద్ద సెన్సెక్స్, నిఫ్టీకి మద్దతు దొరకలేదు. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.90 శాతం, నిఫ్టీ 1.07 శాతం వరకు పతనమయ్యాయి. మిగతా రంగాల సూచీల్లోనూ అమ్మకాలు కనిపించాయి.
క్రితం రోజు 61,308 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,430 వద్ద మొదలైంది. 61,475 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం ఒక్కసారిగా మదుపర్లు విక్రయాలకు దిగడంతో 60,662 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 554 పాయింట్ల నష్టంతో 60,754 వద్ద ముగిసింది.
సోమవారం 18,308 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,337 వద్ద ఆరంభమైంది. 18,350 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. ఆపై విక్రయాల సెగతో 18,085 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 195 పాయింట్ల నష్టంతో 18,113 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ 38,210 వద్ద ముగిసింది. ఉదయం 38,337 వద్ద మొదలైన సూచీ 38,855 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అమ్మకాలు పెరగడంతో 38,095 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. చివరికి 6 పాయింట్ల నష్టంతో ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈలో 1007 షేర్లు లాభపడగా 2218 షేర్లు నష్టపోయాయి. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, మారుతీ సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, ఐచర్ మోటార్స్, టెక్ మహీంద్రా ఎక్కువ నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు లాభపడ్డాయి. ఆటో, ఐటీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియాల్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1-2 శాతం వరకు నష్టపోయాయి.
Also Read: Budget 2022: టాక్స్ పేయర్లకు బడ్జెట్ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!
Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్! ఈ సారి పార్ట్1, పార్ట్2గా విభజన!
Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!
Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!