Stock Market News: FY23 ఆరంభం అదిరింది! సెన్సెక్స్ 708 +, 17,600 ఎగువన నిఫ్టీ
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం లాభాల పంట పండిచాయి. కొత్త ఆర్థిక ఏడాది FY23ని సానుకూలంగా ఆరభించాయి. కొత్త పవర్ పాలసీ ప్రకటించడంతో మార్కెట్లకు ఊపు వచ్చింది.
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం లాభాల పంట పండిచాయి. కొత్త ఆర్థిక ఏడాది FY23ని సానుకూలంగా ఆరభించాయి. కొత్త పవర్ పాలసీ ప్రకటించడంతో మార్కెట్లకు ఊపు వచ్చింది. కొనుగోళ్ల మద్దతులు సూచీలు కళకళలాడాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంటును నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,600 ఎగువన ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 708 పాయింట్లు లాభపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,568 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,530 వద్ద మొదలైంది. మధ్యాహ్నం వరకు సూచీ ఫ్లాట్‌గానే కదలాడింది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్న తర్వాత ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. 58,450 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 59,396 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 708 పాయింట్ల తేడాతో 59,276 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,464 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,436 వద్ద ఓపెనైంది. 17,422 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత పుంజుకొని 17,703 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి ఎగిసింది. చివరికి 205 పాయింట్ల లాభంతో 17,670 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 36,298 వద్ద మొదలైంది. 36,242 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,209 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 774 పాయింట్ల లాభంతో 37,148 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభపడగా 9 నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడ్డాయి. హీరోమోటోకార్ప్, టెక్ మహీంద్రా, దివిస్ ల్యాబ్, ఎస్‌బీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లోనే ముగిశాయి. ఆటో, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, పవర్, పీఎస్‌యూ 1-4 శాతం ఎగిశాయి.
Market Update for the day.
— NSE India (@NSEIndia) April 1, 2022
See more> https://t.co/xBwq7mn9EL https://t.co/F6ARBUOvcp #NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/N9CXVXAu52
Hearty congratulations to Bajaj Finance on completing 19 years of being listed on NSE, one of India's most diverse Non-Banking Finance Companies (NBFC).#ThisDayThatYear #HappyListingDay #NSE #StockMarket #ShareMarket pic.twitter.com/5JCsTQo2rj
— NSE India (@NSEIndia) April 1, 2022