News
News
X

Stock Market Update: స్టాక్‌ మార్కెట్లలో దీపావళి కళ.. వరుస నష్టాలకు చెక్‌.. సెన్సెక్స్‌ మళ్లీ 60వేల +

మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరోసారి 60వేల ఎగువన ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 18 వేల మైలురాయిని సమీపించింది.

FOLLOW US: 

భారత స్టాక్‌ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెట్టాయి. ఐటీ, బ్యాంకింగ్‌ కంపెనీల షేర్లు రాణించడంతో మార్కెట్లు కళకళలాడాయి. మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మరోసారి 60వేల ఎగువన ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 18 వేల మైలురాయిని సమీపించింది.

క్రితం వారం 59,306 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ సోమవారం 59,577 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 60,220 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరి 831 పాయింట్ల లాభంతో 60,138 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం అదే దారిలో నడిచింది. ఉదయం 17,783 వద్ద ఆరంభమై 17,954 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 258 పాయింట్ల లాభంతో 17,929 వద్ద ముగిసింది.

ఇతర సూచీలు కూడా లాభాల్లోనే పరుగులు తీశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 1.8 శాతం, స్మాల్‌క్యాప్‌ 1.1 శాతం, రియాలిటీ సూచీ 3.7 శాతం, టెలికాం, మెటల్‌ సూచీలు 3.5 శాతం, ఐటీ ఇండెక్స్‌ 2.3, బ్యాంకెక్స్‌ 1.8 శాతం లాభపడ్డాయి. మొత్తంగా బీఎస్‌ఈలో 2171 కంపెనీల షేర్లు లాభపడగా 1137 కంపెనీల షేర్లు తగ్గుముఖం పట్టాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7.5 శాతం పెరిగి షేరు ధర రూ.1225కు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ 4 శాతం లాభపడింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్ర, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎస్‌బీఐ, కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ షేర్లు పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్యూ2లో రూ.3,780 కోట్ల లాభం నమోదు చేయడంతో షేరు ధర రూ.1.7 శాతం పెరిగి రూ.2,893కు చేరుకుంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా నష్టపోయాయి.

నైకా ఐపీవోను 33.75 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఫినో ఫేమెంట్స్‌ బ్యాంక్‌ను 40 రెట్లు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు మొదలైన సిగాచిని 4.39 రెట్లు, పీబీ ఫిన్‌టెక్‌ 19 శాతం, ఎస్‌జేఎస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 8 శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి.

Also Read: Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Also Read: Saving Accounts Interest Rates: సేవింగ్స్‌ ఖాతాలపై 7 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు

Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!

Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 04:28 PM (IST) Tags: sensex Nifty Stock Market Update Closing Bell share market HDFC bank

సంబంధిత కథనాలు

Stock Market News: ఆర్‌బీఐ రేట్‌ హైక్‌తో రికార్డ్‌ స్థాయికి పెరిగిన 8 స్టాక్స్‌

Stock Market News: ఆర్‌బీఐ రేట్‌ హైక్‌తో రికార్డ్‌ స్థాయికి పెరిగిన 8 స్టాక్స్‌

Infosys Buyback: Q2 ఫలితాలతోపాటు షేర్ల బైబ్యాక్‌ కూడా, డబుల్‌ బొనాంజా

Infosys Buyback: Q2 ఫలితాలతోపాటు షేర్ల బైబ్యాక్‌ కూడా, డబుల్‌ బొనాంజా

Petrol-Diesel Price, 1 October: నెలతోపాటు పెట్రో రేట్లూ మారాయి, మీ ఏరియాలో ధర ఇది!

Petrol-Diesel Price, 1 October: నెలతోపాటు పెట్రో రేట్లూ మారాయి, మీ ఏరియాలో ధర ఇది!

Gold-Silver Price 1 October 2022: పండుగ దగ్గర పడేకొద్దీ పసిడి రేటు పైపైకి!

Gold-Silver Price 1 October 2022: పండుగ దగ్గర పడేకొద్దీ పసిడి రేటు పైపైకి!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

Tata Tiago EV: దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు - 57 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - టియాగో ఈవీ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?