Stock Market Update: మూడో రోజూ బుల్స్‌దే! 17000 పైన నిఫ్టీ ముగింపు
అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, సెంటిమెంట్ బాగుండటంతో సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడింది. నిఫ్టీకి 17000 వద్ద మద్దతు దొరికింది.
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. మదుపర్లు కొనుగోళ్లు చేసేందుకు మొగ్గు చూపారు. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండటం, సెంటిమెంట్ బాగుండటంతో సెన్సెక్స్ 384 పాయింట్లు లాభపడింది. నిఫ్టీకి 17000 వద్ద మద్దతు దొరికింది.
క్రితం రోజు 56,930 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,251 వద్ద ఆరంభమైంది. 12 గంటల ప్రాంతంలో ఇంట్రాడే కనిష్ఠమైన 57,146ను తాకింది. ఆపై కొనుగోళ్లు పుంజుకోవడంతో 57,490 వద్ద గరిష్ఠాన్ని అందుకొంది. చివరికి 384 పాయింట్లు లాభపడి 57,315 వద్ద ముగిసింది.
బుధవారం 16,955 వద్ద ముగిసిన నిఫ్టీ గురువారం 17,066 వద్ద మొదలైంది. 17,015 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. క్రమంగా పుంజుకొని 17,118 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 117 పాయింట్ల లాభంతో 17,072 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ 161 పాయింట్లు లాభపడింది. ఉదయం 35,350 వద్ద ఆరంభమైన సూచీ 35,477 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొంది. డెరివేటివ్స్ కాంట్రాక్టుల వారాంతపు ముగింపు కావడంతో 35,046 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 35,191 వద్ద ముగిసింది.
నిఫ్టీలో పవర్‌గ్రిడ్, ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతి ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సెమ్ నష్టపోయాయి. మెటల్ మినహాయిస్తే మిగిలిన అన్ని సూచీలూ సానుకూలంగానే కదలాడాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియాలిటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతం పెరిగాయి.
Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు
Also Read: Card Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డు టోకెనైజేషన్ గడువు పొడగించాలని ఆర్‌బీఐకి వినతి
Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్