Stock Market Update: అమెరికాలో ధరల మోత! మన స్టాక్ మార్కెట్లకు నష్టాల వాత! సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 డౌన్
Stock Market Update Telugu: అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వార్తలతో సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్ల మేర పతనమయ్యాయి.
Stock Market Update Telugu: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఎరుపెక్కాయి! కీలక సూచీలు రక్తమోడుతున్నాయి! అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం, యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వార్తలు మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీశాయి.
వినియోగ వస్తువుల ధరలు పెరగడంతో అంతర్జాతీయంగా మరికొన్ని రోజులు మార్కెట్లు ఊగిలాడొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1000, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 300 పాయింట్ల మేర పతనమయ్యాయి. మిగతా రంగాల సూచీలూ ఎరుపు రంగులో కదలాడుతున్నాయి.
BSE Sensex
క్రితం రోజు 58,926 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 58,447 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తోనే మొదలైంది. అమెరికా ద్రవ్యోల్బణం గురించి తెలియడంతో ఆందోళనకు గురైన మదుపర్లు విక్రయాలు చేపట్టారు. దాంతో సూచీ 57,914 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం కోలుకొని 58,447 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. ప్రస్తుతం 850 పాయింట్ల నస్టంతో 58,075 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,607 వద్ద ముగిసిన నిఫ్టీ శుక్రవారం 17,451 వద్ద మొదలైంది. విక్రయాల వెల్లువతో 17,303 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై కాస్త కోలుకొని 17,454 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. దాదాపు 300 పాయింట్ల మేర పతనమైన సూచీ ప్రస్తుతం 265 పాయింట్ల నష్టంతో 17,343 వద్ద కొనసాగుతోంది.
Bank Nifty
బ్యాంకు నిఫ్టీ సైతం ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. 38,567 వద్ద ఆరంభమైన సూచీ 38,396 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 38,781 వద్ద గరిష్ఠ స్థాయిని చేరుకుంది. ప్రస్తుతం 463 పాయింట్ల నష్టంతో 38,547 వద్ద కొనసాగుతోంది.
Other Indices
నిఫ్టీలో 46 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉండగా 4 లాభాల్లో ఉన్నాయి. ఐఓసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా స్టీల్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్రాసిమ్, ఇన్ఫీ, బ్రిటానియా, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా 3-5 వరకు నష్టాల్లో ఉన్నాయి. ఐటీ, స్థిరాస్తి సూచీలు 2 శాతం వరకు, ఆటో, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఒక శాతం వరకు పతనం అయ్యాయి.
Also Read: క్రిప్టో కరెన్సీపై RBI అప్‌డేట్! శక్తికాంత దాస్‌ది మళ్లీ మళ్లీ అదే మాట!
Also Read: స్టాక్ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.10 లక్షల కోట్లు- ఒక్క రిలయన్స్‌లోనే రూ.లక్ష కోట్లు