Share Market Opening: సెన్సెక్స్ 700 పాయింట్స్ డౌన్ - నిరాశలో నిఫ్టీ బ్యాంక్, ఐటీ - ప్రకాశిస్తున్న లోహాలు
Share Market Down: గ్లోబల్ మార్కెట్లలో మిక్స్‌డ్ ట్రెండ్ ఉండడంతో, దేశీయ షేర్ మార్కెట్లు ఈ రోజు డౌన్‌సైడ్‌లో ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పతనమైంది.
Stock Market News Updates Today 30 Sept: ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 30 సెప్టెంబర్ 2024) నిరాశ, నిర్వేదంతో ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్ బెల్‌లో, ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ బ్యాంక్ దాదాపు 250 పాయింట్లు పడిపోయింది. స్టాక్ మార్కెట్‌లో నీరసానికి గ్లోబల్ సిగ్నల్స్ కారణమయ్యాయి. ఈ రోజు జపాన్ మార్కెట్ భారీగా పడిపోయింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (శుక్రవారం) 85,571 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 363.09 పాయింట్లు లేదా 0.42 శాతం క్షీణతతో 85,208.76 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శుక్రవారం 26,277 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 117.65 పాయింట్లు లేదా 0.45 శాతం పతనంతో 26,061.30 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
షేర్ల పరిస్థితి
సెన్సెక్స్30 ప్యాక్‌లో... టాటా స్టీల్ 1.41 శాతం, ఎన్‌టీపీసీ 1.36 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.29 శాతం, టైటన్ 1.03 శాతం, ఏసియన్ పెయింట్స్ 0.57 శాతం లాభాల్లో ఉన్నాయి. మరోవైపు... టెక్ మహీంద్ర 1.68 శాతం, మహీంద్ర & మహీంద్ర 1.60 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.35 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0,90 శాతం, మారుతి సుజుకీ 0.89 శాతం పతనంతో కొనసాగుతున్నాయి.
సెక్టార్ల వారీగా...
నిఫ్టీ మెటల్ 1.41 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ & గ్యాస్ కూడా పచ్చగా ఉన్నాయి. వీటికి విరుద్ధంగా... నిఫ్టీ రియాల్టీ 1.12 శాతం తగ్గి టాప్ డ్రాగర్‌గా మారింది. ఐటీ, ఆటో సెక్టార్లు వరుసగా 0.95 శాతం, 0.80 శాతం క్షీణించాయి.
ప్రి మార్కెట్
ప్రి-ఓపెనింగ్ సెషన్‌లో, BSE సెన్సెక్స్ 153.97 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 85,725 స్థాయి వద్ద ట్రేడయింది. అదే టైమ్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పడిపోయింది, 307.10 పాయింట్లు లేదా 1.17 శాతం పతనంతో 25,871.85 వద్ద ఉంది.
ఉదయం 09.50 గంటలకు, BSE సెన్సెక్స్ 718.25 పాయింట్లు లేదా 0.84% తగ్గి 84,853.60 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 204.90 పాయింట్లు లేదా 0.78% పడిపోయి 25,974.05 దగ్గర ట్రేడవుతోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఈ రోజు జపాన్ మార్కెట్ చాలా బలహీనంగా మారింది, 4.64 శాతం క్షీణతను చూపుతోంది. వార్త రాసే సమయానికి, జపాన్ స్టాక్ మార్కెట్ ప్రధాన ఇండెక్స్ నికాయ్ 1849.22 పాయింట్ల నష్టంతో 37,980.34 వద్ద ట్రేడవుతోంది. చైనా ప్రధాన మార్కెట్ ఇండెక్స్ షాంఘై కాంపోజిట్ మాత్రం దాదాపు 6 శాతం పెరిగింది, 176 పాయింట్లు లాభపడింది. చైనా మాన్యుఫాక్చరింగ్ కాంట్రాక్ట్స్ విషయంలో భయాలు తొలగిపోవడంతో డ్రాగన్ సూచీలు ఆకాశంలోకి ఎగిరాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి స్వల్ప క్షీణతతో ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: దిగి వస్తున్న ఇంధనం రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి