Market Opening: సెన్సెక్స్ 63,830 దిగువన, నిఫ్టీ 19 వేల పైన - స్వల్ప నష్టాల్లో స్టార్టయిన స్టాక్ మార్కెట్లు
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఇప్పటికీ మద్దతు కోసం పోరాడుతున్నాయి.
Share Market Opening on 01 November 2023: ఈ రోజు (బుధవారం) దేశీయ మార్కెట్ సంకేతాలు అంతగా ప్రోత్సాహకరంగా లేదు. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఇప్పటికీ మద్దతు కోసం పోరాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 125 పాయింట్లు నష్టపోయి 42,750 స్థాయికి దిగువకు వచ్చింది.
ఈ రోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్
ఈ రోజు ట్రేడింగ్‌లో మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 45 పాయింట్ల పతనంతో 63,829 స్థాయిల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. NSE నిఫ్టీ కేవలం 15 పాయింట్లు దిగజారి 19,064 వద్ద ఓపెన్ అయింది.
మార్కెట్ ప్రారంభంలో BSE స్థాయిలు
అడ్వాన్స్ డిక్లైన్ రేషియోను పరిశీలిస్తే... ఓపెనింగ్ ట్రేడ్‌లో 1696 షేర్లు క్షీణించగా, 922 షేర్లు పెరిగాయి. 111 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 30లోని 24 షేర్లు బలం చూపగా, మిగిలిన 6 స్టాక్స్‌లో బలహీనత కనిపించింది.
నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ స్థితి
ఎర్లీ ట్రేడ్‌లో, నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, హెల్త్‌కేర్ సెక్టార్లలో క్షీణత కనిపించింది. రియల్టీ స్టాక్స్ అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి, 1.26 శాతం పెరిగాయి. ఆటో సెక్టార్ షేర్లు 0.30 శాతం లాభంతో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్ సెక్టోరల్ ఇండెక్స్ స్థితి
మార్కెట్ ప్రారంభంలో, S&P BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.11% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% లోయర్ సైడ్‌లో ఉంది. సెన్సెక్స్ సెక్టోరల్ ఇండెక్టుల్లో.. 20 రంగాల్లో 8 క్షీణించగా, 12 రంగాలు పురోగమనంలో ఉన్నాయి. BSE రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా పెరిగాయి.
గెయినర్స్-లూజర్స్
ఉదయం 9.38 గంటలకు సెన్సెక్స్ 30 షేర్లలో 20 లాభాల్లో ఉండగా, 10 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్లలో BPCL 2.09 శాతం, బజాజ్ ఆటో 1.77 శాతం లాభపడ్డాయి. హీరో మోటోకార్ప్ షేర్లు 1.64 శాతం, ONGC 1.10 శాతం చొప్పున పెరిగాయి. విప్రో 0.65 శాతం, టాటా మోటార్స్ 0.62 శాతం గ్రీన్‌లో కొనసాగాయి. టాటా కన్స్యూమర్స్ 0.57 శాతం వృద్ధిని చూపింది.
JSW స్టీల్ 1.79 శాతం, భారతి ఎయిర్‌టెల్ 0.50 శాతం క్షీణించాయి. యాక్సిస్ బ్యాంక్ 0.54 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 0.49 శాతం, పవర్ గ్రిడ్ 0.45 శాతం బలహీనతతో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ షేర్లు 0.42 క్షీణత చూపాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial