అన్వేషించండి

Share Market Closing Today: ఫెడ్‌ నిర్ణయాలకు ముందు ఐటీ షేర్లలో ప్రాఫిట్‌ బుకింగ్స్‌ - 25,400 దిగువన నిఫ్టీ

Share Market Updates Today: బీఎస్‌ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ రూ.467.58 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఈ రోజు సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ.2.71 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.

Stock Market Closing On 18 September 2024: వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకోనున్న నిర్ణయాల ఎఫెక్ట్‌ భారత స్టాక్‌ మార్కెట్‌పై పడింది. మన మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 18 సెప్టెంబర్‌ 2024) ఒడుదొడుకులను ఎదుర్కొని, చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో ఆల్ టైమ్ హైని తాకిన మార్కెట్లు, మధ్యాహ్నం నుంచి అమ్మకాల కారణంగా పట్టు తప్పి పడిపోయింది. యూఎస్‌ వడ్డీ రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఐటీ షేర్లలో భారీ క్షీణత స్పష్టంగా (ప్రాఫిట్‌ బుకింగ్‌) కనిపించింది, మార్కెట్లను అవి కిందకు లాగాయి. అయితే, నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ షేర్లలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. ఫెడ్‌ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు "వెయిట్‌ అండ్‌ వాచ్‌" మోడ్‌లోకి వెళ్లారు.

బుధవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో BSE సెన్సెక్స్‌ తాజా గరిష్ట స్థాయి 83,326.38ని తాకింది. NSE నిఫ్టీ కూడా బుధవారం సెషన్‌ను ముగించే ముందు 25,482.20 గరిష్ట స్థాయిని టచ్‌ చేసింది.

ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 131.43 పాయింట్లు లేదా 0.16% తగ్గి 82,948.23 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 41 పాయింట్లు లేదా 0.16% పడిపోయి 25,377.55 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్‌ 83,037.13 వద్ద, నిఫ్టీ 25,402.40 వద్ద ఓపెన్‌ అయ్యాయి.

పెరిగిన & పడిపోయిన షేర్లు
నిఫ్టీ50 ప్యాక్‌లో 33 స్టాక్స్‌ నష్టాల్లో కూరుకుపోతే, 17 స్టాక్స్‌ లాభాలను జోడించాయి. TCS, ఇన్ఫోసిస్‌, HCL టెక్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి, 3.50 శాతం వరకు పతనంతో రోజును ముగించాయి. మరోవైపు.. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, HDFC బ్యాంక్ షేర్లు 4.22 శాతం వరకు లాభపడ్డాయి, టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.

BSE స్పేస్‌లో 19 షేర్లు లాస్‌ అయ్యాయి, 11 షేర్లు ప్రాఫిట్స్‌ అందుకున్నాయి. TCS, ఇన్ఫోసిస్‌, Tech మహీంద్రా, HCL టెక్, సన్ ఫార్మా స్టాక్స్‌ 3.46 శాతం వరకు తగ్గాయి. అదే సమయంలో... బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, HDFC బ్యాంక్ షేర్లు 3.36 శాతం వరకు లాభాలతో గ్రీన్‌లో ముగిశాయి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వరుసగా మూడవ రోజూ ర్యాలీని కొనసాగించింది, దాదాపు 2% పెరిగింది.

BSEలో మొత్తం 4.058 షేర్లు ట్రేడ్ అవగా, వాటిలో.. 1,712 స్టాక్స్ లాభాలతో, 2,237 నష్టాలతో ముగిశాయి. 109 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

సెక్టార్ల వారీగా చూస్తే..
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.05 శాతం నష్టంతో స్థిరపడింది. అదే సమయంలో... ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగాలు దూసుకెళ్లాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ నిఫ్టీ సూచీలు వరుసగా 1.40 శాతం & 1.06 శాతం పెరిగాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు కూడా 0.96 శాతం వరకు లాభపడ్డాయి.

భారీగా తగ్గిన మార్కెట్ క్యాప్‌
మార్కెట్ పతనం, ముఖ్యంగా ఐటీ స్టాక్స్, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీ పతనం కారణంగా, BSEలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ రూ. 467.58 లక్షల కోట్ల వద్ద ముగిసింది. నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఇది రూ. 470.29 లక్షల కోట్ల వద్ద ఉంది. అంటే, ఈ రోజు సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ. 2.71 లక్షల కోట్లు నష్టపోయారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఇల్లు కొనడం బెటరా, అద్దెకు ఉండడం బెటరా? ఈసారి మీ డౌట్‌ తీరిపోతుంది 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'

వీడియోలు

అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారా? హైదరాబాద్‌ శివారులోని ఫామ్ హౌస్ పార్టీలో ఏం జరిగింది?
NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఎంటర్ ది న్యూ 'డ్రాగన్'
AP Minister Vasamsetti Subhash : మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
మంత్రిగారు యాక్ట‌ర‌య్యారు!సినిమాలో న‌టిస్తోన్న ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్‌! సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ ఫొటోలు వైరల్
Cricket Match Fixing: క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
క్రికెట్‌పై మళ్ళీ 'మ్యాచ్ ఫిక్సింగ్' మచ్చ! నలుగురు భారత్ ఆటగాళ్ళపై చర్యలు
Kajal Aggarwal : ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
ఓటీటీలోకి 'చందమామ' రీ ఎంట్రీ - బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Embed widget