By: Arun Kumar Veera | Updated at : 18 Sep 2024 04:20 PM (IST)
ఇల్లు కొనడం బెటరా, అద్దెకు ఉండడం బెటరా? ( Image Source : Other )
Own House Vs Rented House: చాలామంది, ఇంటిని అద్దెకు తీసుకోవాలా లేదా కొనాలా అన్న గందరగోళాన్ని ఎదుర్కొంటుంటారు. దీనికి, అందరికీ సరిపోయే ఒకే సమాధానం ఏదీ లేదు. అయితే.. గ్లోబల్ ట్రెండ్స్, లోకల్ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవచ్చు.
కొన్నేళ్ల నుంచి భారత్‌లో గృహ విక్రయాలు జోరందుకున్నాయి. తాజా ఆర్థిక సర్వే ప్రకారం, గృహ విక్రయాల్లో ఒక దశాబ్దంలోనే 2023 ఉత్తమ సంవత్సరం. అదే సమయంలో ఇళ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. 2024 జనవరి-మార్చి కాలంలో, ఇళ్ల రేట్ల పెరుగుదలలో ప్రపంచ నగరాల్లో ముంబై మూడో స్థానంలో, దిల్లీ ఐదో ప్లేస్‌లో ఉన్నాయి.
నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, ముంబై ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో సగానికి పైగా హోమ్ లోన్ EMIలు చెల్లిస్తున్నారు.
గత నాలుగేళ్లలో, మన దేశంలో ప్రాపర్టీ రేట్లు సగటున 46% పెరిగాయి. ఈ రేస్‌లో హైదరాబాద్, నోయిడా వంటి నగరాలు ముందున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో, హైదరాబాద్‌లో 78.6% & నోయిడాలో 69% చొప్పున ధరలు పెరిగాయి.
బెస్ట్ ఆప్షన్ ఏంటి?
రియల్ ఎస్టేట్ రాజధాని ముంబైని ఉదాహరణగా తీసుకుందాం. ఆ మహా నగరంలో కొద్దిగా పెద్దగా ఉండే 1 BHK లేదా చిన్నపాటి 2 BHK సగటు ధర ₹94 లక్షలుగా ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేట్లు 8.75% ప్రకారం, 20 సంవత్సరాలకు EMI₹83,000 అవుతుంది. సంవత్సరానికి ఈ మొత్తం ₹9,96,000.
ఇప్పుడు, అదే సైజ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటే నెలకు రూ.30,000 చెల్లించాలి. ఏడాదికి ₹3,60,000 అవుతుంది. అంటే, మీకు ప్రతి ఏటా దాదాపు ₹6 లక్షలు, నెలకు ₹50,000 చొప్పున మిగులుతాయి. ఈ డబ్బును మెరుగైన రాబడిని అందించే ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టొచ్చు.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో (SIP) నెలకు ₹50,000ను ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం 12% రాబడి వస్తుందని భావిస్తే, 20 సంవత్సరాలు పూర్తయ్యేసరికి మీ పెట్టుబడుల విలువ ₹4.3 కోట్లు అవుతుంది.
ఇప్పుడు సొంత ఇంటి దగ్గరకు వద్దాం. మీ ఇంటి ఆస్తి విలువ ఏడాదికి 8% పెరుగుతుందని భావిస్తే, ఆ ఆస్తి విలువ 20 ఏళ్లకు అదే ₹4.3 కోట్లుగా ఉంటుంది. అయితే ఇది గాల్లో కనిపించే విలువ లాంటిది. 20 ఏళ్ల వయస్సున్న చిన్నపాటి 2 BHK కోసం అంత రేటు చెల్లించేందుకు ఏ బయ్యర్ ముందుకురాడు. అంతేకాదు, మీరు అపార్ట్‌మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు బ్యాంక్ లోన్ తీసుకుంటే, వడ్డీతో కలిపి దాదాపు ₹2 కోట్లు చెల్లించాలి. ఈ విధంగా చూసినా 20 ఏళ్ల వయస్సున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు అంత డబ్బు ఎవరూ పెట్టరు.
ముంబై కంటే తక్కువ రేట్లు ఉండే ఇతర నగరాల్లోని ఇండివిడ్యువల్ ఇళ్లు లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ల విషయంలో ఈ లెక్క కాస్త మారొచ్చు. కానీ, సారాంశం అదే అవుతుంది.
ఆస్తి ధరలు పెరిగినట్లుగానే అద్దెలు కూడా ఏటా పెరుగుతూనే ఉంటాయి. నోయిడాలో వార్షిక అద్దె 2024లో 3.70% పెరిగింది, 2019లో ఇది 3.20%గా ఉంది. సాధారణంగా, అద్దె పెంపు ఏడాదికి 5% వరకు ఉంటుంది. కాబట్టి, అద్దె ఇంట్లో ఉన్నా ఏటా జేబుకు చిల్లు పెరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు ఏం చేయాలి?
చాలామందికి అద్దె ఇల్లు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, కెరీర్‌లో ప్రారంభంలో లేదా పని కోసం ప్రాంతాలు మారేవారికి రెంటెడ్ రూట్ బాగుంటుంది. సరైన ధరకు ఇల్లు దొరుకుతున్నప్పుడు, ఆ ఇంటిని కొనుగోలు చేయడం తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిగా మారుతుంది.
కాబట్టి, సొంత ఇల్లు బెటరా, అద్దె ఇల్లు బెటరా అన్న ప్రశ్నకు అందరికీ సరిపోయే సమాధానమంటూ లేదు. వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ఆప్షన్ మారుతుంది. అయితే హైబ్రిడ్ విధానం మాత్రం చాలా మందికి సూటవుతుంది. మొదట అద్దె ఇంట్లో ఉండి పొదుపు చేస్తూ, కొంతమొత్తం పోగయిన తర్వాత కొనుగోలు చేయడం బెస్ట్ ఆప్షన్.
మరో ఆసక్తికర కథనం: టప్పర్‌వేర్ ఇంత షాక్ ఇచ్చిందేంటి గురూ, తట్టుకోవడం కాస్త కష్టమే!
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్ హ్యపీ, ఎందుకంటే?