అన్వేషించండి

Spandana Sphoorty Q2 Results: స్పందన స్ఫూర్తి లాభం ₹55 కోట్లు

మొదటి త్రైమాసికంలో రూ.220 కోట్ల నష్టాన్ని ఈ కంపెనీ మూటగట్టుకుంది. దానికి వ్యతిరేకంగా ఈసారి లాభాలు ఆర్జించింది.

Spandana Sphoorty Q2 Results: హైదరాబాదీ కంపెనీ, మైక్రో లెండర్ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిడెడ్‌ (Spandana Sphoorty Financial Ltd), ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23) మంచి పనితీరు కనబరిచింది. రెండో త్రైమాసికంలో రూ.55.2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోని నష్టాలను దాటుకుని ఈసారి లాభాలను మూటగట్టుకుంది. పైగా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆదాయం తగ్గినప్పటికీ లాభాన్ని పెంచుకోవడం విశేషం.

ఆదాయం - లాభం
2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి, రూ.311 కోట్ల మొత్తం ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. 55.2 కోట్ల రూపాయల పన్ను అనంతర లాభాన్ని (PAT) సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.310 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికం ఆదాయం దాదాపు 20 శాతం పెరిగింది. అయితే, మొదటి త్రైమాసికంలో రూ.220 కోట్ల నష్టాన్ని ఈ కంపెనీ మూటగట్టుకుంది. దానికి వ్యతిరేకంగా ఈసారి లాభాలు ఆర్జించింది. 

రుణదాత మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.396 కోట్ల నుంచి ఈసారి తగ్గింది.

వడ్డీ ఆదాయం (Interest income) కూడా, గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.350.5 కోట్ల నుంచి ఈసారి రూ.276.5 కోట్లకు తగ్గింది. 21 శాతం (YoY) క్షీణించింది. 

రెండో త్రైమాసికంలో మొత్తం రూ.1391 కోట్ల రుణాలను స్పందన స్ఫూర్తి అందించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఈ మొత్తం 5 శాతం అధికం.

2022 సెప్టెంబర్ చివరి నాటికి, స్థూల నిరర్థక ఆస్తుల (GNPAs) నిష్పత్తి 7.47 శాతం కాగా నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి (NNPAs) 3.96 శాతంగా తేలాయి. మొత్తం కేటాయింపులు (Provisions) రూ.303 కోట్లుగా కంపెనీ తెలిపింది. నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (AUM) ఇది 5.23 శాతం. ఇంత శాతం ఉండడం ఆందోళనకర విషయం.

కంపెనీ AUM గత త్రైమాసికం కంటే ఈ త్రైమాసికంలో (QoQ) దాదాపు 5 శాతం పెరిగి రూ.5,782 కోట్లకు చేరుకుంది.

పెరిగిన కొత్త కస్టమర్లు
కొత్త కస్టమర్లను సంపాదిచడం మీద కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన రూ.1391 కోట్ల రుణాల్లో 46 శాతాన్ని కొత్త కస్టమర్ల కోసమే కేటాయించింది. దీంతో, తన వినియోగదారులు 16 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.

మొత్తం లోన్‌ బుక్‌లో రూరల్‌ పోర్ట్‌ఫోలియో పెరిగింది. అంతకుముందున్న 85 శాతం నుంచి 88 శాతానికి వృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల మీద కంపెనీ ఫోకస్‌ పెంచిందని ఈ వృద్ధి చెబుతోంది.

సోమవారం సెషన్‌లో 28.85 రూపాయలు పెరిగిన స్పందన స్ఫూర్తి షేరు ధర, రూ.606.05 కు చేరింది. 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget