News
News
X

Adani Group Companies: 2022లో అదానీ స్టాక్సే తోపులు - ఆయన్ను ప్రపంచ కుబేరుడిగా మార్చిన సీక్రెట్‌ ఇదే!

ఈ ఏడు కంపెనీల ప్రస్తుతానికి రెండు కంపెనీలు నిఫ్టీ 50 ప్యాక్‌లో చోటు సంపాదించాయి. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ మొదటిది కాగా, రెండోది అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.

FOLLOW US: 
Share:

Adani Group Companies: ప్రపంచంలో మూడో అతి పెద్ద ధనవంతుడు గౌతమ్‌ అదానీ చేతిలో మొత్తం 9 లిస్టెడ్‌ కంపెనీలు ఉన్నాయి. అవి.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌ & సెజ్‌, అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ విల్మార్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్‌. వీటిలో, ఏసీసీ, అంబుజా సిమెంట్‌ను ఈ మధ్యే కొన్నారు. 

ఏసీసీ, అంబుజా సిమెంట్‌ మినహా మిగిలిన ఏడు లిస్టెడ్‌ కంపెనీల గురించి మాట్లాడుకుందాం. ఈ ఏడు స్టాక్స్‌ ఈ సంవత్సరంలో (2022) ఇప్పటి వరకు (Year To Date లేదా YTD) ఇండియన్‌ స్టాక్ బెంచ్‌మార్క్‌లను అధిగమించి ఎదిగాయి. ఈ కంపెనీల ప్రమోటర్ గౌతమ్ అదానీని ప్రపంచంలో అత్యంత సంపన్నుల లీగ్‌లో చేర్చాయి.

ఈ ఏడు కంపెనీల ప్రస్తుతానికి రెండు కంపెనీలు నిఫ్టీ 50 ప్యాక్‌లో చోటు సంపాదించాయి. అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ మొదటిది కాగా, రెండోది అదానీ ఎంటర్‌ప్రైజెస్‌. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సెమీ యాన్యువల్‌ రెజిగ్‌లో భాగంగా సెప్టెంబర్ 30 నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా యాడ్‌ అయింది. శ్రీ సిమెంట్‌ స్థానంలో ఇది నిఫ్టీ50 లిస్ట్‌లోకి అడుగు పెట్టింది.

అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నిఫ్టీ 50లో చేర్చిన తర్వాత $213 మిలియన్లకు పైగా పెట్టుబడులు కొత్తగా వచ్చి పడ్డాయని ఎడెల్‌వీస్ ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ రిపోర్ట్‌ చేసింది. దీంతో అదానీ నికర విలువ భారీగా పెరిగింది.

రాకెట్‌ను తలపించిన అదానీ ఎంటర్‌ప్రైజెస్
కొత్తగా నిఫ్టీ50లోకి ప్రవేశం తర్వాత, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెనుదిరిగి చూడలేదు. భారీగా లాభపడింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 128% పెరిగింది. 2022 సంవత్సరంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నిఫ్టీ 50 స్టాక్ ఇది. 

2022లో ఇప్పటి వరకు అన్ని టాప్ నిఫ్టీ50 గెయినర్స్‌ను అదానీ ఎంటర్‌ప్రైజెస్ అధిగమించినప్పటికీ, అదానీ గ్రూప్‌లో ఇదే బెస్ట్‌ కాదు. దీనికి తాతలాంటి గ్రూప్‌ స్టాక్స్‌ ఉన్నాయి.

అదానీ పవర్ లిమిటెడ్ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 222% పెరిగింది. అదానీ విల్మార్ లిమిటెడ్ 140% జంప్‌ చేశాయి.

అదానీ పోర్ట్స్ & సెజ్‌ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20% లాభపడింది. టాప్ నిఫ్టీ 50 గెయినర్స్‌ కంటే అండర్‌ పెర్ఫార్మ్‌ చేసిన అదానీ గ్రూప్‌ స్టాక్‌ ఇది మాత్రమే.

బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో నం.2 స్థానానికి (ఆ తర్వాత 3వ స్థానానికి దిగి వచ్చారు) చేరుకున్న ఏకైక ఆసియా ఖండపు వ్యక్తి గౌతమ్‌ అదానీ. గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల గౌతమ్ అదానీ సంపదను అమాంతం పెంచింది.

అదానీ నికర విలువ ప్రస్తుతం $140.9 బిలియన్లుగా ఉంది. 2022లోనే $64.4 బిలియన్ల సంపద యాడ్‌ అయింది. ఆయన కంటే ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ మాత్రమే ఉన్నారు. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 03 Dec 2022 11:12 AM (IST) Tags: Stock Market Gautam Adani. Adani Group Companies Adani Group Stocks Nifty 50 Gainers

సంబంధిత కథనాలు

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్‌ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత

Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి

Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి

LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్‌ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి

LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్‌ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి

Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?

Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

CBI Case Avinash Reddy :  సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !

Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao :  వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?

Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?